- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యుద్ధం ముగిస్తాం కానీ.. అమెరికా-ఇజ్రాయెల్‌కు ఇరాన్ ‘మూడు’ సంచలన షరతులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుతున్న వేళ, ఇరాన్ అధ్యక్షుడు మసోద్ పెజెష్కియాన్ సంచలన ప్రకటన చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుతున్న వేళ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian) సంచలన ప్రకటన చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ దళాలతో సాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలంటే మూడు కీలక షరతులను ఆయన తెరపైకి తెచ్చారు. ఈ డిమాండ్లకు అంగీకరిస్తేనే ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని తక్షణమే తెరుస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు పెజెష్కియాన్ తన సోషల్ మీడియా వేదికగా అంతర్జాతీయ సమాజానికి ఇరాన్ పక్షాన ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.
ఇరాన్ విధించిన 3 ప్రధాన షరతులు ఇవే..
అంతర్జాతీయ వేదికలపై ఇరాన్ సహజ సిద్ధమైన హక్కులను అధికారికంగా గుర్తించాలని తెలిపారు. ప్రస్తుత యుద్ధం కారణంగా ఇరాన్‌కు జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇరాన్ సార్వభౌమాధికారంపై మళ్లీ ఎటువంటి దాడులు చేయబోమని అంతర్జాతీయంగా గ్యారెంటీ (హామీ) ఇవ్వాలని వెల్లడించారు.
రగులుతున్న పశ్చిమాసియా..
గత ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా ఇరాన్‌పై ఆకస్మిక దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీ సహా పలువురు అగ్రశ్రేణి నాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన ఇరాన్.. ప్రతీకారంగా ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తోంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లను పేల్చివేయడంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలపై ప్రభావం పడుతోంది.






