అమెరికాతో చర్చలపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు.. ఒప్పుకునే ప్రసక్తే లేదంటూ..!

by Yella Dhawani Reddy |

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్ 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో ఇరాన్‌లోని అణు స్థావరాలపై భారీ దాడులు చేయడం

అమెరికాతో చర్చలపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు.. ఒప్పుకునే ప్రసక్తే లేదంటూ..!
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు భయానక స్థాయికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్ (Isreal) ‘ఆపరేషన్ రైజింగ్ లయన్ (Operation Rising Lion)’ పేరుతో ఇరాన్‌లోని (Iran) కీలక అణు స్థావరాలపై ఆకస్మిక దాడులు జరిపింది. ఈ దాడులు ఇరాన్‌కు తీవ్రమైన దెబ్బగా మారాయి. వెంటనే ప్రతిస్పందించిన ఇరాన్, అధునాతన మిస్సైళ్లతో ఇజ్రాయెల్ వైపు ఎదురుదాడులు ప్రారంభించింది. ఈ ఘర్షణలతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించిన ఇరాన్ .. 'ఇది యుద్ధ ప్రకటనలాంటిదే. మేము దీన్ని ఎలా తట్టుకుంటామో ప్రపంచమే చూడబోతుంది' అంటూ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు, అమెరికాతో అణు ఒప్పందంపై చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మాట్లాడుతూ 'అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చూస్తుంటే ఇజ్రాయెల్ దాడులకు అమెరికా నేరుగా ప్రమేయం ఉన్నట్టు స్పష్టమవుతోంది' అని ఆరోపించాడు. అలాగే 'అణు ఒప్పందం పేరిట అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదు' అని తేల్చేశారు. కాగా, ఇరాన్ చర్చలకు ముందుకు రాకపోతే రెండు వారాల్లో తుది నిర్ణయం తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. ట్రంప్‌ చేస్తున్న ఇజ్రాయెల్ అనుకూల వ్యాఖ్యలు అమెరికా-ఇజ్రాయెల్ ఘాట్ బంధాన్ని వెలుగులోకి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అబ్బాస్ తీవ్ర స్థాయిలో స్పందించారు.

Next Story