- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్ మళ్లీ అణ్వాయుధాల తయారీకి వెళితే తీవ్ర పరిణామాలు: జేడీ వాన్స్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఇజ్రాయిల్ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన వేళ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఇజ్రాయిల్ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన వేళ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ మళ్లీ అణ్వాయుధాల తయారీకి యత్నిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అమెరికా, ఇరాన్ అణ్వాయుధాలు తయారీ చేయకుండా తన నిబద్ధతను చాటుకుందన్నారు.
భవిష్యత్తులో చేయాలన్న అమెరికా సైన్యంను ఎదుర్కొవాల్సిందే..
భవిష్యత్తు లో ఇరాన్ మళ్లీ న్యూక్లియర్ వెపన్స్ తయారీ చేయాలనుకుంటే వారు అత్యంత శక్తిమంతమైన అమెరికా సైన్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటి వరకు తాము కేవలం ఇరాన్ తో అణు కార్యక్రమంపైనే పోరాడుతున్నామని ప్రకటించారు. అమెరికా చేసిన దాడులతో ఇరాన్ ఇక అణు కార్యక్రమాలు చేసే సామర్థ్యం లేదని పేర్కొన్నారు. అమెరికా భారీ స్థాయిలో బంకర్ బ్లస్టర్ బాంబులతో విరుచుకుపడినప్పటికీ యురేనియం జాడ మాత్రం కనిపించలేదు. అణుబాంబు తయారీకి అవసరమైన యురేనియం 235ను ఇరాన్ తయారు చేస్తోందనే అమెరికా, ఇజ్రాయిల్ ఆరోపిస్తున్నాయి. అయితే ఇరాన్ లో 60 శాతం శుద్ధి చేసిన 400 కేజీల యురేనియం ఉందని దీంతో దాదాపు 10 అణు బాంబులు తయారు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.






