- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీరుట్‌లో నలుగురు దౌత్యవేత్తలను చంపిన ఇజ్రాయెల్: యూఎన్‌కు ఇరాన్ లేఖ
లెబనాన్ రాజధాని బీరుట్‌లో తమ దేశానికి చెందిన నలుగురు సీనియర్ దౌత్యవేత్తలను ఇజ్రాయెల్ హత్య చేసిందని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానీ సంచలన ఆరోపణలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. లెబనాన్ రాజధాని బీరుట్‌లో తమ దేశానికి చెందిన నలుగురు సీనియర్ దౌత్యవేత్తలను ఇజ్రాయెల్ హత్య చేసిందని (United Nations) ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌కు ఆయన లేఖ రాశారు. కావాలనే మార్చి 8వ తేదీన బీరుట్‌లోని రమదా హోటల్‌పై ఇజ్రాయెల్ సైన్యం (IDF) దాడి చేసిందని, ఈ ఘటనలో నలుగురు ఇరాన్ దౌత్యవేత్తలు ప్రాణాలు కోల్పోయారని ఇరవానీ తన లేఖల పేర్కొన్నారు. అంతకుముందు లెబనాన్‌లోని ఇరాన్ ప్రతినిధులను లక్ష్యంగా చేసుకుంటామని ఇజ్రాయెల్ హెచ్చరించిన నేపథ్యంలో, భద్రతా కారణాల దృష్ట్యా వారిని తాత్కాలికంగా హోటల్‌కు తరలించగా ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన వివరించారు. ఒక సార్వభౌమ దేశ ప్రతినిధులను మరో దేశ భూభాగంలో హత్య చేయడం హేయమైన ఉగ్రవాద చర్య అని అభివర్ణించారు. ఇది అంతర్జాతీయ చట్టాలను, 1973 నాటి అంతర్జాతీయ రక్షణ ఒప్పందాలను ఉల్లంఘించడమేనని తెలిపారు. ఈ ఉల్లంఘనలను శిక్షించకుండా వదలకూడదని ఇరవానీ లేఖలో స్పష్టం చేశారు.
హిజ్బుల్లా కమాండర్ హతం..
మరోవైపు, ఇజ్రాయెల్ తన దాడులను మరింత తీవ్రతరం చేసింది. హిజ్బుల్లాకు నిధులు సమకూర్చే 'అల్-ఖర్ద్ అల్-హసన్ అసోసియేషన్' లక్ష్యంగా లెబనాన్‌లో పలుచోట్ల వైమానిక దాడులు నిర్వహించినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఈ దాడుల్లో హిజ్బుల్లా 'నాసర్' యూనిట్ కమాండర్ హసన్ సలామేను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. అంతేకాకుండా, ఇరాన్‌లోని టెహ్రాన్, తబ్రిజ్ నగరాల్లోని కీలక సైనిక స్థావరాలు, బాలిస్టిక్ క్షిపణి కమాండ్ సెంటర్లు, బాసిజ్ బలగాల కాంపౌండ్లపై ఇజ్రాయెల్ బలగాలు మెరుపు దాడులు నిర్వహించాయి.






