అండ‌ర్ గ్రౌండ్ మిస్సైల్ సిటీ వీడియో రిలీజ్ చేసిన ఇరాన్

by velandi.Saikiran |

అండ‌ర్ గ్రౌండ్ మిస్సైల్ సిటీ వీడియో రిలీజ్ చేసింది ఇరాన్. త‌మ ద‌గ్గ‌ర సూసైడ్ డ్రోన్ బోట్లు ఉన్నాయ‌ని పేర్కొంది.

అండ‌ర్ గ్రౌండ్ మిస్సైల్ సిటీ వీడియో రిలీజ్ చేసిన ఇరాన్
X

దిశ, వెబ్ డెస్క్‌: ఇజ్రాయెల్, అమెరికా దేశాలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న ఇరాన్ దేశం సంచలన ప్రకటన చేసింది. తమ అండర్ గ్రౌండ్ మిస్సైల్ సిటీని పరిచయం చేస్తూ వీడియో రిలీజ్ చేసింది ఇరాన్. తమ వద్ద పెద్ద సంఖ్యలో సూసైడ్ డ్రోన్ బోట్లు ఉన్నాయని ఇందులో వెల్లడించింది. వాటిని హర్మూజ్ జల సంధిలో ( Strait of Hormuz) మొహరిస్తున్నారని ప్రకటన చేసింది ఇరాన్ మిలిటరీ. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసి మరి వార్నింగ్ ఇచ్చింది. దీనిని అండర్ గ్రౌండ్ మిస్సైల్ సిటీగా ( Underground Missile City) పిలుస్తామని తెలిపింది.

నేవల్ డ్రోన్లు, యాంటీ షిప్ మిస్సైళ్ళు, సముద్ర మైన్స్ ఈ టన్నెల్స్ లో భారీగా కనిపించాయి. కాగా ఇటీవల సూసైడ్ డ్రోన్ తోనే అమెరికాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఇరాన్ అగ్ర లీడర్ల సమాచారం అందిస్తే రూ. 92.5 కోట్లు రివార్డు ఇస్తామని అమెరికా తాజాగా ప్రకటన చేసింది. వాళ్ల జాడ చెప్పిన వాళ్లకు రివార్డు ఇవ్వడమే కాకుండా భద్రత కూడా కల్పిస్తామని పేర్కొంది. ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తాబా ఖ‌మేనీతో పాటు మరో 9 మంది సమాచారం ఇవ్వాలని అమెరికా పేర్కొంది.

Next Story