- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోమాలోనే మొజ్తబా ఖమేనీ.. UK మీడియా సంచలన ప్రకటన
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కోమాలో ఉన్నాడని పేర్కొంది యూకే మీడియా.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో యూకే మీడియా షాకింగ్ నిజాలను బయటపెట్టింది. ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కోమాలో ఉన్నాడని పేర్కొంది యూకే మీడియా. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఒక కాలు కోల్పోయారని కూడా పేర్కొంది. పొట్ట, లివర్ కు తీవ్రంగా మొజ్తాబా ఖమేనీకి గాయాలు అయినట్లు స్పష్టం చేసింది. అయితే, మొజ్తాబా ఖమేనీ ఏ విధంగా గాయపడ్డారనే విషయాన్ని యూకే మీడియా స్పష్టం చేయలేదు. కానీ కోమాలో ఉన్నాడని పేర్కొంది.
కోమాలో మొజ్తాబా ఖమేనీ !
అసలు అలీ ఖమేనీ చనిపోయిన రోజే ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ గాయపడ్డాడా ? లేక మరో చోట దాడి జరగగా అక్కడ గాయపడ్డారా ? అనే వార్తలపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే మొజ్తాబా ఖమేనీ కోమాలో ఉన్నాడన్న వార్త బయటకు రాగానే ఇరాన్ ప్రభుత్వ టీవీ సంచలన ప్రకటన చేసింది. హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేసేది లేదని మొజ్తాబా ఖమేనీ హెచ్చరించాడని ఇరాన్ ప్రభుత్వ టీవీ వెల్లడించింది. అయితే కోమాలో ఉన్న వ్యక్తి ఎలా ఇలాంటి వార్నింగులు ఇస్తారని చర్చ జరుగుతోంది. దీంతో కోమాలో ఉన్నప్పటికీ అమెరికాకు మొజ్తాబా ఖమేనీ వార్నింగ్ ఇచ్చారని బ్రిటన్ మీడియా సెటైర్లు కూడా పేల్చింది. కాగా మార్చి 3వ తేదీన ఇరాన్ సుప్రీం లీడర్ గా బాధ్యతలు తీసుకున్నాడు మొజ్తాబా ఖమేనీ. ఫిబ్రవరి 28వ తేదీన అలీ ఖమేనీ, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన సంగతి తెలిసిందే.






