ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు.. వీడ్కోలు కార్యక్రమం వాయిదా

by Ramesh Naini |

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు.. వీడ్కోలు కార్యక్రమం వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ వీడ్కోలు కార్యక్రమం వాయిదా పడింది. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ఐదో రోజుకు చేరుకోవడం, దాడుల తీవ్రత పెరగడంతో భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత వారంలో జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ (86) ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. బుధవారం (నేడు) సాయంత్రం టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేనీ గ్రాండ్ మసీదులో ఆయన భౌతికకాయానికి నివాళులర్పించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే, అనూహ్య సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటం, మరోవైపు దాడులు కొనసాగుతుండటంతో ఈ వేడుకను వాయిదా వేస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా 'ఫార్స్' వెల్లడించింది. తదుపరి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది.

మషాద్‌లో అంత్యక్రియలు..

ఖమేనీ అంత్యక్రియలు ఆయన స్వస్థలమైన మషాద్ నగరంలో నిర్వహించనున్నారు. అక్కడి ప్రసిద్ధ ఇమామ్ రజా మసీదు ప్రాంగణంలోనే ఖమేనీ తండ్రి సమాధి కూడా ఉంది. ఇక సంతాప దినాలు పాటించాలని ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.

Next Story