- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమేనీ భార్య బతికే ఉన్నారు..ఇరాన్ మీడియా ప్రకటన
దివంగత ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ భార్య బతికే ఉందని ఇరాన్ రాష్ట్ర మీడియా తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏ ఒక్క దేశం కూడా వెనక్కి తగ్గడం లేదు. తలవంచడం లేదు. యుద్ధంలో ముందుకు వెళ్లడం తప్ప, మరో మార్గం లేనట్లే వ్యవహరిస్తున్నాయి. ఈ తరుణంలో వేలాది మంది సైనికులు మరణిస్తున్నారు. దివంగత ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ ఫిబ్రవరి 28వ తేదీన ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు. అయినప్పటికీ యుద్దం ఆగడం లేదు.
అయితే ఇలాంటి నేపథ్యంలో ఓ షాకింగ్ నిజం బయట పెట్టింది ఇరాన్ మీడియా. ఇజ్రాయిల్ దాడుల్లో దివంగత ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ ( Supreme Leader Ali Khamenei) భార్య మన్సౌరే ఖోజస్తే బఘెర్జాదే ( Mansoureh Khojasteh Bagherzadeh) చనిపోయినట్లు వచ్చిన వార్తలను ఖండించింది ఇరాన్ మీడియా. ఆమె ఇంకా బతికే ఉన్నారని ఐఆర్జీసీ అనుబంధం మీడియా సంస్థ ఫార్స్ స్పష్టం చేసింది.
కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కూడా తన తొలి అధికారిక ప్రసంగంలో తల్లి మరణించారని ఎక్కడ ప్రస్తావించలేదు అని గుర్తు చేసింది. దీంతో దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ భార్య బతికే ఉందని చర్చ జరుగుతోంది. కాగా కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కోమాలో ఉన్నాడని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.






