- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Iran reports: ఇరాన్‌లోని 131 ప్రాంతాల్లో US - ఇజ్రాయెల్ దాడులు.. 555 మంది మృతి!
గత మూడు రోజులుగా ఇరాన్‌లోని 131 నగరాల్లోని వ్యూహాత్మక ప్రాంతాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ వాయుసేనలు విరుచుకుపడుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో మొదలైన ఉద్రిక్తతలు ఇప్పుడు అమెరికా-ఇజ్రాయెల్ కూటమి, ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధానికి దారితీశాయి. గత మూడు రోజులుగా ఇరాన్‌లోని 131 నగరాల్లోని వ్యూహాత్మక ప్రాంతాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ వాయుసేనలు విరుచుకుపడుతున్నాయి.
భారీగా ప్రాణనష్టం
ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (Iranian Red Crescent Society) సోమవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఈ దాడుల్లో ఇప్పటి వరకు కనీసం 555 మంది మరణించారు. వేల సంఖ్యలో ప్రజలు గాయపడగా, ఆసుపత్రులు బాధితులతో కిక్కిరిసిపోయాయి. ఖమేనీతో పాటు మరికొంతమంది అగ్రనేతలు మరణించినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. సోమవారం తెల్లవారుజామున సనందాజ్ నగరంలోని నివాస ప్రాంతాలపై జరిగిన దాడుల్లో ముగ్గురు పౌరులు మరణించారు.
విస్తరిస్తున్న యుద్ధం..
ఇరాన్ సైతం గట్టిగానే ప్రతిఘటిస్తోందని తెలుస్తోంది. ఇటు ఇజ్రాయెల్‌పై, అటు అరబ్ దేశాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. టెహ్రాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా గ్రూపు ఇజ్రాయెల్‌పై దాడులు చేయడంతో, ఇజ్రాయెల్ లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. మరోవైపు, ఇరాక్, సైప్రస్‌లోని అమెరికా, బ్రిటన్ స్థావరాలపై డ్రోన్ దాడులు జరిగినట్లు అంతర్జాతీయ మీడియా (ఏపీ) స్పష్టం చేసింది.






