- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాతో యుద్ధం.. ఇరాన్ కీలక వ్యాఖ్యలు
అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్ ఆర్థిక ఇబ్బందులను ఉపయోగించుకుని ఇజ్రాయెల్, అమెరికా, యూరప్ నాయకులు అశాంతిని రేకెత్తిస్తున్నారని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్ ఆర్థిక ఇబ్బందులను ఉపయోగించుకుని ఇజ్రాయెల్, అమెరికా, యూరప్ నాయకులు అశాంతిని రేకెత్తిస్తున్నారని అన్నారు. అమెరికాతో తాము యుద్ధం కోరుకోవడంలేదని స్పష్టం చేశారు. ఇరాన్ ప్రజలను రెచ్చగొట్టి దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నించారని, ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారని అన్నారు.
ఇరాన్ లో జరిగిన నిరసణలు సామాజిక నిరసనలు మాత్రమే కావని అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. అమెరికాతో యుద్ధం కోరుకోవడంలేదని ఇరాన్ కు గానీ, అమెరికాకు గానీ సంఘర్షణలు ప్రయోజనకరం కాదని చెప్పారు. ఇదిలా ఉంటే ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ తమతో చర్చలకు వచ్చిందని అన్నారు. ఏదైనా ఒప్పందం జరుగుతుందో లేదో చూడాలని.. మొత్తంగా ఏదో జరుగుతుందని వ్యాఖ్యానించారు. దీంతో ఇరు దేశాల మధ్యల పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






