- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > ప్రపంచం > ఇరాన్ క్షిపణి దాడులు.. దెబ్బతిన్న దుబాయ్ విమానాశ్రయం, బుర్జ్ అల్ అరబ్ హోటల్!
ఇరాన్ క్షిపణి దాడులు.. దెబ్బతిన్న దుబాయ్ విమానాశ్రయం, బుర్జ్ అల్ అరబ్ హోటల్!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ నిర్వహించిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రతిష్టాత్మక బుర్జ్ అల్ అరబ్ హోటల్‌కు స్వల్ప నష్టం వాటిల్లినట్లు వార్తలు వస్తున్నాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: గల్ఫ్ దేశాలపై ఇరాన్ నిర్వహించిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రతిష్టాత్మక బుర్జ్ అల్ అరబ్ హోటల్‌కు స్వల్ప నష్టం వాటిల్లినట్లు వార్తలు వస్తున్నాయి. రాత్రి జరిగిన ఈ ఘటనలో విమానాశ్రయ టెర్మినల్‌లో ఒక భాగం దెబ్బతినగా, నలుగురు గాయపడ్డారని దుబాయ్ మీడియా ఆదివారం తెలిపింది. విమానాశ్రయంలో జరిగిన ఘటనను మొదట ‘ఇన్సిడెంట్’గా మాత్రమే పేర్కొన్న అధికారులు, తర్వాత డ్రోన్‌ను అడ్డుకుని కూల్చివేయడంతో దాని ముక్కలు పడి చిన్నపాటి అగ్నిప్రమాదం సంభవించిందని వెల్లడించారు. అదే సమయంలో, బుర్జ్ అల్ అరబ్ హోటల్ బాహ్య గోడపై డ్రోన్ శకలాలు పడటంతో అక్కడ కూడా స్వల్పంగా మంటలు చెలరేగినట్లు తెలిపారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిసింది.
ఇరాన్ సౌదీ అరేబియానే ఎందుకు టార్గెట్ చేసింది?
Next Story






