- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ballistic missile: ఇజ్రాయిల్ పై బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగించాం: ఇరాన్
ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరుకుంది. ఇజ్రాయిల్ మొదట ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేయగా.. ఇరాన్ ధీటుగా బదులిస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరుకుంది. ఇజ్రాయిల్ మొదట ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేయగా.. ఇరాన్ ధీటుగా బదులిస్తోంది. ఇరాన్ దేశానికి చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తాజాగా చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఇజ్రాయిల్ పై తాము బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు తెలిపింది. హజ్ ఖాసీం గైడెడె బాలిస్టిక్ మిస్సైల్ గా దాన్ని పేర్కొన్నారు. కానీ దీన్ని కచ్చితంగా ఏ ప్రదేశంలో ప్రయోగించారో మాత్రం తెలపలేదు. ఇరాన్ రక్షణ మంత్రి అజిజ్ నసీర్‌జాదా మే 4న ఓ ప్రోగ్రాంలో మాట్లాడుతూ.. 1200 కిలోమీటర్ల రేంజ్ లోని రక్షణ వ్యవస్థలను ఛేదించుకుని వెళ్లగల బాలిస్టిక్ మిస్సైల్ రెడీ అయినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దీన్నే ఇజ్రాయిల్ పై వినియోగించినట్లు తెలుస్తోంది. దీని వార్ హెడ్ గమనాన్ని మార్చుకుని ప్రయాణించగలదని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని ఛేజ్ చేయడంలో ఈ బాలిస్టిక్ క్షిపణి బాగా పనిచేస్తుందని తెలుస్తోంది.
ఇప్పట్లో యుద్ధం ఆగేలా లేదు.. అమెరికా
ఇరాన్ గత రాత్రి జరిపిన దాడిలో ఇజ్రాయిల్ లో 200 మందికి పైగా గాయపడ్డారని ఇజ్రాయిల్ గవర్నమెంట్ తెలిపింది. మరో 35 మంది జాడ తెలియడం లేదని ఆ దేశ మీడియా వార్త కథనాలు తెలుపుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయిల్ సంక్షోభం మరి కొన్ని రోజుల్లో ముగిసేలా లేదని అమెరికా పేర్కొంది. దీనికి మరికొన్ని వారాలు సమయం పట్టవచ్చని వైట్ హౌస్ పేర్కొంది. కాగా ఇరాన్ పై దాడికి తాము సహకరించడం లేదని అమెరికా చెబుతున్నప్పటికీ పరోక్షంగా అమెరికా అండ దండలతోనే ఇరాన్ పై ఇజ్రాయిల్ దాడి చేస్తుందని యుద్ధ నిపుణులు, ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి.






