- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇజ్రాయెల్‌పై మరోసారి ఇరాన్ దాడులు.. క్షిపణులతో ఎటాక్
ఇజ్రాయెల్(Israel)పై మరోసారి ఇరాన్(Iran) దాడులకు పాల్పడింది. జెరూసలేం, టెల్ అవీవ్ సహా పలు ప్రాంతాల్లో క్షిపణులతో ఎటాక్ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్(Israel)పై మరోసారి ఇరాన్(Iran) దాడులకు పాల్పడింది. జెరూసలేం, టెల్ అవీవ్ సహా పలు ప్రాంతాల్లో క్షిపణులతో ఎటాక్ చేసింది. వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ రెండు ఇరాన్ డ్రోన్లను కూల్చివేసింది. మరోవైపు ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో అమెరికా(USA)లోనూ అలర్ట్ ప్రకటించారు. అమెరికా భద్రతా సంస్థలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. న్యూయార్క్‌లోని మత, సాంస్కృతిక ప్రదేశాలు, రాయబార కార్యాలయాల దగ్గర పోలీసులు బందోబస్తు పెంచారు. అంతకుముందు ఇరాన్‌లోని మూడు అణుకేంద్రాలే లక్ష్యంగా అమెరికా విరుచుకుపడింది. దీనికి ప్రతిగా టెహ్రాన్ ఎలాంటి చర్యలకు దిగుతుందనే ఆందోళన సర్వత్రా నెలకొంది. దీంతో అమెరికా అప్రమత్తమైంది. పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు ముందుగానే జాగ్రత్తపడుతోంది. అందులో భాగంగా ప్రార్థనా స్థలాలు, సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేసింది. వాషింగ్టన్‌తో సహా పలు నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించింది.






