- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని మోడీతో ఇరాన్ సుప్రీం సమావేశం..ట్వీట్ వైరల్ !
2016 లో ప్రధాని మోదీ, ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీ సమావేశం అయ్యారు. అప్పటి పాత ట్వీట్ వైరల్ అయింది.

iran Ali Khamenei old tweet goes viral when he met PM Modi in 2016
దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ - అమెరికా దేశాల మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు రోజుల నుంచి యుద్ధం భయంకరంగా జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది మూడు దేశాల సైనికులు మరణించారు. ఇజ్రాయెల్-అమెరికాపై ఉన్న కోపంతో గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఈ సంఘటనలో కూడా సామాన్యులు మరణిస్తున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్నమన భారతీయులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఫిబ్రవరి 28వ తేదీన ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ( Ayatollah Ali Khamenei ) మరణించారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా మరణించినట్లు ఇప్పటికే ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇలాంటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, అయతుల్లా అలీ ఖమేనీ ఫోటో వైరల్ గా మారింది.
ప్రధాని మోడీతో అయతుల్లా అలీ ఖమేనీ.. ట్వీట్ వైరల్ !
ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, అయతుల్లా అలీ ఖమేనీ ఇద్దరు సమావేశం అయిన ఫోటో వైరల్ గా మారింది. 2016లో ఇరాన్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ (PM narendra modi ) వెళ్లారు. ఆ సందర్భంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో మోడీ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశంపై అప్పట్లో అయతుల్లా అలీ ఖమేనీ ( Ayatollah Ali Khamenei ) సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. యుద్ధం సమయంలో ఇరాన్ కు ఇండియా సపోర్ట్ చేస్తుందన్న ప్రచారం తెరపైకి వస్తుందని కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.
2016లో ఇరాన్ పర్యటనకు ప్రధాని మోడీ
దాదాపు పది సంవత్సరాల కిందట 2016 సమయంలో ఇరాన్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు కూడా జరిగాయి. ఇందులో మొదటిది చాబహార్ ఓడరేవు ఒప్పందం. పాకిస్తాన్ తో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్తాన్, గల్ఫ్ దేశాలకు ఇటు ఇండియా చేరుకోవడానికి ఒక వ్యూహాత్మక మార్గం ఏర్పాటు చేయడం లక్ష్యం. దీని కోసం 500 డాలర్ల మిలియన్లు పెట్టుబడిగా ఇస్తున్నట్లు ఇండియా ప్రకటించింది. వాణిజ్యం, ఇంధనం, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఒప్పందాలు కూడా జరిగాయి.
మొత్తంగా అప్పట్లో ఇరాన్, భారత్ మధ్య 12 ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా ప్రధాని నరేంద్ర మోడీ 2016 సంవత్సరంలో ఇరాన్ పర్యటనకు వెళ్లారు. 2016 సంవత్సరం మే 22, 23 తేదీలలో అధికారికంగా ఇరాన్ దేశంలో పర్యటించారు. మొదట టెహ్రాన్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ... 2016 మే 22వ తేదీన గురుద్వార్ కూడా సందర్శించారు. ఈ సందర్భంగా ఇండియన్స్ తో స్పెషల్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక 2016 మే 23వ తేదీన ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ తో సమావేశమయ్యారు.






