Pritam Singh: పార్లమెంట్‌లో అబద్దాలు చెబితే అంతే! ఆ ఎంపీకి లక్షల్లో జరిమానా విధింపు

by Ramesh Naini |

భారత సంతతికి చెందిన నేత ప్రీతమ్ సింగ్‌కు ఓ కేసులో షాక్ తగిలింది. ప్రతిపక్ష నేతగా ఉన్నా ఆయన.. పార్లమెంట్‌లో అబద్దాలు చెప్పారని భారీ జరిమాన పడింది.

Pritam Singh: పార్లమెంట్‌లో అబద్దాలు చెబితే అంతే! ఆ ఎంపీకి లక్షల్లో జరిమానా విధింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సింగపూర్‌లోని (Indian-origin) భారత సంతతికి చెందిన నేత ప్రీతమ్ సింగ్‌(Pritam Singh)కు ఓ కేసులో షాక్ తగిలింది. ప్రతిపక్ష నేతగా ఉన్నా ఆయన.. పార్లమెంట్‌లో అబద్దాలు చెప్పారని భారీ జరిమాన పడింది. అబద్దాలు చెప్పారని తేలడంతో దాదాపు 14 వేల సింగపూర్ డాలర్లు జరిమానా విధిస్తూ స్థానిక న్యాయస్థానం తాజాగా తీర్పు నిచ్చింది. అయితే, జరగబోయే ఎన్నికల్లో ఈ ఘటన సింగ్‌పై ప్రభావితం అయ్యేలా ఉందని టాక్ నడుస్తోంది. మరోవైపు ఎన్నికల నుంచి అనర్హత పడే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇక ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు పోటి చేయనున్నట్లు సింగ్ తాజాగా మీడియాకు తెలిపారు.

అయితే, సింగపూర్‌లో వర్కర్స్ పార్టీకి చెందిన ప్రీతమ్ సింగ్.. డిసెంబర్ 2021లో అదే పార్టీకి చెందిన సభ్యురాలు రయీసా ఖాన్‌ (Raeesah Khan)పై పార్లెమెంట్‌లో అబద్ధం చెప్పారనే ఆరోపణలతో ప్రివిలేజెస్ కమిటీ విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా పార్లమెంటరీ కమిటీకి ఉద్దేశపూర్వకంగా రెండు తప్పుడు సమాధానాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. లైంగిక వేధింపుల బాధితురాలితో పాటు పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం గురించి ఖాన్ పార్లమెంటులో చేసిన తప్పుడు వాదనను సింగ్ నిర్వహించిన తీరు ఈ కేసుకు కారణమైంది. రెండు అభియోగాల్లో నేరం రుజువు కావడంతో ఒక్కో కేసులో 7 వేల సింగపూర్ డాలర్ల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

Next Story