అమెరికాలో ఘోర ప్రమాదం.. భారత సంతతి వ్యక్తి సహా ముగ్గురు మృతి

by Naga Rani Yarlagadda |

అమెరికాలో ట్రెక్కింగ్ చేస్తుండగా ప్రమాదానికి గురై ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో భారత సంతతికి చెందిన ఇంజినీర్ విష్ణు ఇరిగిరెడ్డి కూడా ఉన్నాడు.

అమెరికాలో ఘోర ప్రమాదం.. భారత సంతతి వ్యక్తి సహా ముగ్గురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో ట్రెక్కింగ్ చేస్తుండగా ప్రమాదానికి గురై ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో భారత సంతతికి చెందిన ఇంజినీర్ విష్ణు ఇరిగిరెడ్డి కూడా ఉన్నాడు. వాషింగ్టన్ రాష్ట్రంలోని నార్త్ క్యాస్కేడ్స్ ట్రెక్కింగ్ కు వెళ్లిన గ్రూప్ ప్రమాదానికి గురికావడంతో ఈ విషాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి బయటపడిన మరో యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

సియాటెల్ లోని ప్రముఖ కంపెనీలో విష్ణు ఇరిగిరెడ్డి (48) ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. తన స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ చేసేందుకు నార్త్ ఎర్లీ వింటర్స్ స్పియర్స్‌కు వెళ్లారు. ట్రెక్కింగ్ చేసి.. కిందిరికి దిగుతున్న సమయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో యాంకర్ పాయింట్ అదుపుతప్పి 200 అడుగుల లోతులో పడిపోయారు. ప్రాణాలతో బయటపడిన యువకుడు 64 కిలోమీటర్లు నడిచి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. ప్రమాద ఘటన గురించి అధికారులకు వెల్లడించారు. రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకుని మృతదేహాలను వెలికితీశాయి.

Next Story