న్యూయార్క్‌లో భారతీయ మామిడి పండుగ.. మన రుచులకు ఫిదా అయిన అమెరికన్లు! (వీడియో)

by Ramesh Naini |

న్యూయార్క్‌ నగరంలో భారతీయ మామిడి పండ్ల ఘుమఘుమలు విరజిమ్మాయి.

న్యూయార్క్‌లో భారతీయ మామిడి పండుగ.. మన రుచులకు ఫిదా అయిన అమెరికన్లు! (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: న్యూయార్క్‌ నగరంలో భారతీయ మామిడి పండ్ల ఘుమఘుమలు విరజిమ్మాయి. భారత రాయబార కార్యాలయం (Consulate General of India) ఆధ్వర్యంలో జూన్ 23న ‘ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్’ ఘనంగా జరిగింది. యూనియన్ స్క్వేర్‌లోని ‘టైమ్ అవుట్ మార్కెట్‌’లో నిర్వహించిన ఈ వేడుకకు అమెరికన్లు, ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ ప్రదర్శనలో భారతదేశానికి చెందిన ప్రసిద్ధ ‘గిర్ కేసర్’, ‘వారణాసి లంగ్డా’ రకాలకు చెందిన మామిడి పండ్లను ఉంచారు. వెయ్యి మందికి పైగా న్యూయార్కర్లు వీటిని రుచి చూసి మన మామిడి తీపికి ఫిదా అయ్యారు.

అమెరికాలో భారతీయ మామిడి పండ్లకు విశేష ఆదరణ పెరుగుతోందని, అందుకే న్యూయార్క్‌లో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని డిప్యూటీ కాన్సుల్ జనరల్ విశాల్ హర్ష్ తెలిపారు. ఈ పండుగను విజయవంతంగా నిర్వహించడంలో ‘టైమ్ అవుట్ న్యూయార్క్’ సంస్థ ప్రత్యేక సహకారం అందించినట్లు తెలిపారు.

Next Story