దుబాయ్‌లో భారీ వర్షాల నేపథ్యంలో భారత పౌరుల కోసం హెల్ప్‌లైన్ నంబర్‌లు

by Disha Web Desk 17 |
దుబాయ్‌లో భారీ వర్షాల నేపథ్యంలో భారత పౌరుల కోసం హెల్ప్‌లైన్ నంబర్‌లు
X

దిశ, నేషనల్ బ్యూరో: దుబాయ్‌లో భారీ వర్షాలు, వరదలు సంభవించిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి భారత సంతతి పౌరుల కోసం ఇండియన్ కాన్సులేట్ జనరల్ హెల్ప్‌లైన్ నంబర్‌లను జారీ చేసింది. దుబాయ్‌లో ప్రస్తుతం రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. విమానాలు రద్దు కావడంతో చాలా మంది ప్రయాణికులు దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్నారు. రోడ్లపై భారీగా నీరు ఉండడంతో కొంతమంది తమ వాహనాలను రోడ్లపైనే వదిలేశారు. దుబాయ్‌లో ఉన్నటువంటి భారత ప్రజలను అన్ని వేళలా సహయం అందించడానికి అలాగే, చిక్కుకుపోయిన ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు తాము యూఏఈ అధికారులు, విమానయాన సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని భారత కాన్సులేట్ తెలిపింది.

దుబాయ్‌లో ఉన్నటువంటి భారత పౌరులు సంప్రాదించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లు : +971501205172, +971569950590, +971507347676, +971585754213. ఈ నంబర్లను ఇండియన్ కాన్సులేట్ తన సోషల్ మీడయా ఎక్స్‌లో ప్రకటించింది. యూఏఈ వ్యాప్తంగా సోమవారం రాత్రి మొదలైన వర్షాలు, మంగళవారానికి కుంభవృష్టిగా మారాయి. 24 గంటల వ్యవధిలో 142 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఏడాది కాలంలో కురవాల్సిన మొత్తం వర్షం ఒక్కరోజులో కురవడంతో దుబాయ్‌ తడిసి ముద్దయింది. దీంతో భారత్ నుంచి దుబాయ్ మధ్య దాదాపు 28 విమానాలు రద్దు అయ్యాయి.

Next Story

Most Viewed