- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాక్ బస్సుపై ఆత్మాహుతి దాడి..ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో కుజ్ దార్ ప్రావిన్స్‌లో ఆర్మీ స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో నలుగురు విద్యార్థులు మరణించగా, మ

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో కుజ్ దార్ ప్రావిన్స్‌లో ఆర్మీ స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో నలుగురు విద్యార్థులు మరణించగా, మరికొందరికి గాయాలయ్యాయి. కాగా ఈ దాడి వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ పాక్ మిలటరీ వింగ్ సంచలన ఆరోపణలు చేసింది. దాయాది దేశం ఆరోపణలను భారత్ ఖండించింది. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ స్పందించారు.
సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు పాకిస్థాన్ ఇలాంటి ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. స్కూల్ బస్సుపై దాడిలో పలువురు చిన్నారులు చనిపోవడంపై భారత్ విచారం వ్యక్తం చేసిందన్నారు. ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న పాకిస్థాన్ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. తమ అంతర్గత సమస్యలపై భారత్ ను తప్పుపట్టడం పాకిస్థాన్ కు అలవాటుగా మారిందన్నారు. ప్రపంచం కళ్లకు గంతలు కట్టేందుకు పాకిస్థాన్ చేస్తున్న విషలయత్నం ఇది అని అన్నారు.






