భారత్‌ నమ్మకమైన మిత్రదేశం: బంగ్లా పీఎం ప్రశంసలు

by Dishanational2 |
భారత్‌ నమ్మకమైన మిత్రదేశం: బంగ్లా పీఎం ప్రశంసలు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌పై బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ నమ్మకమైన భాగస్వామి అని కొనియాడారు. ఆదివారం ఆ దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘భారత్ మాకు నమ్మకమైన మిత్రదేశం. లిబరేషన్ వార్ టైంలో మాకు మద్దతిచ్చారు. 1975 తర్వాత మేము సర్వం కోల్పోయినప్పుడు కూడా వారు మాకు ఆశ్రయం ఇచ్చారు’ అని వ్యాఖ్యానించారు. 1971లో జరిగిన విముక్తి యుద్ధంలోనూ బంగ్లాదేశ్ ప్రజలకు భారతదేశం ఆశ్రయమిచ్చిందని గుర్తు చేశారు. కాగా, భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య చారిత్రక సాంస్కృతిక, ఆర్థిక పరమైన ద్వైపాక్షిక సంబంధాలను కలిగి ఉంటాయి. ఇది ఇటీవలి కాలంలో మరింత బలపడింది. కనెక్టివిటీ ప్రాజెక్ట్‌లు, వాణిజ్య సరళీకరణ, సరిహద్దు నిర్వహణ వంటి కీలకమైన ద్వైపాక్షిక సమస్యలపై ఇరు దేశాలు పురోగతి సాధించాయి.

Next Story

Most Viewed