Israel-Iran: చేదాటిన పరిస్థితులు.. వారిని రోడ్డు మార్గం గుండా దేశం దాటించేందుకు ఏర్పాట్లు

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-19 18:21:34  IST  )

ఇరాన్ - ఇజ్రాయెల్(Israel-Iran War) మధ్య పరిస్థితులు మరింత చేదాటాయి. దీంతో ఆపరేషన్‌ సింధును భారత ప్రభుత్వం(Indian Govt) వేగవంతం చేసింది.

Israel-Iran: చేదాటిన పరిస్థితులు.. వారిని రోడ్డు మార్గం గుండా దేశం దాటించేందుకు ఏర్పాట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ - ఇజ్రాయెల్(Israel-Iran War) మధ్య పరిస్థితులు మరింత చేదాటాయి. దీంతో ఆపరేషన్‌ సింధును భారత ప్రభుత్వం(Indian Govt) వేగవంతం చేసింది. ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను కూడా వెనక్కి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించారు. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌ గగనతలం మూతబడింది. దీంతో చేసేదేం లేక రోడ్డుమార్గాన ఇజ్రాయెల్‌ దాటించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇజ్రాయెల్‌ నుంచి భారత్‌ రావాలనుకునే వారు వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని భారత ఎంబసీ సూచనలు చేసింది. టెల్‌ అవీవ్‌లోని ఎంబసీలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు.

మరోవైపు.. ఇరాన్‌ అణ్వాయుధ ప్రణాళికలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు యురేనియం శుద్ధి కేంద్రాలను ఐడీఎఫ్‌ ధ్వంసం చేసింది. అయితే.. అణు బాంబుల తయారీ కోసం టెహ్రాన్‌కు ఉన్న అన్ని వనరులను సమూలంగా నాశనం చేసేందుకు ఇజ్రాయెల్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Read More .....

Oil Price: దేశంలో చమురు కొరత లేదు: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి

Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిని మూసేసే యోచనలో ఇరాన్

Next Story