- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుజరాత్ లో హిందీ తప్పనిసరి కానప్పుడు మహారాష్ట్రలో ఎందుకు? ఎన్సీపీ నేత సుప్రియ సులే
గుజరాత్ లో హిందీ తప్పనిసరి కానపుడు మహారాష్ట్రలో ఎందుకు త్రిభాషా సూత్రం అమలు చేస్తున్నారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) నాయకురాలు సుప్రియా సూలే ఆ రాష్ట్ర సర్కారును ప్రశ్నించారు.

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్ లో హిందీ తప్పనిసరి కానపుడు మహారాష్ట్రలో ఎందుకు త్రిభాషా సూత్రం అమలు చేస్తున్నారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) నాయకురాలు సుప్రియా సూలే ఆ రాష్ట్ర సర్కారును ప్రశ్నించారు. మహారాష్ట్రలో తప్పనిసరి త్రిభాషా సూత్రం అమలు పట్ల నిరాశ వ్యక్తం చేశారు. గుజరాత్, కేరళ, తమిళనాడు ఒడిశా వంటి రాష్ట్రాలు ఒకే విధమైన నిబంధనను కలిగి లేవన్నారు. మొదటి తరగతి నుంచి హిందీ బోధన ఇక్కడ (మహారాష్ట్ర) ఎందుకు అమలు చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రపంచ సంఘర్షణల మధ్య విదేశాల్లో దౌత్య కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు దేశం, రాష్ట్రం, పార్టీ కుటుంబానికి ప్రాధాన్యత, ప్రాముఖ్యతను సులే నొక్కి చెప్పారు. విదేశాలలో ఉన్న భారతీయ సమాజం చర్చల సమయంలో మహాత్మా గాంధీ , ఇందిరా గాంధీ వంటి వ్యక్తుల పట్ల బలమైన నమ్మకం, విధేయత చూపించారన్నారు.
ఒకటో తరగతి నుంచి హిందీ తప్పనిసరిపై ఆగ్రహం
మహారాష్ట్ర విద్యా వ్యవస్థలో ఆందోళనలను ప్రస్తావిస్తూ, 1వ తరగతి నుంచి హిందీని తప్పనిసరి చేయాలనే నిర్ణయాన్ని సూలే విమర్శించారు. ఉపాధ్యాయుల కొరత, విద్య నాణ్యత తగ్గడం అంశాలను ఆమె ఎత్తి చూపారు, విద్యా విధానాలు రాజకీయ ప్రేరణల కంటే నిపుణుల సిఫార్సులపై ఆధారపడి ఉండాలన్నారు. పిల్లలపై మూడు భాషలను తప్పనిసరిగా రుద్దడాన్ని ప్రభుత్వం సమర్థనను సులే ప్రశ్నించారు. పాఠశాలలు, ఆసుపత్రులను మెరుగుపరచడానికి తగినంత వనరులను కేటాయించడంలో విఫలమవుతున్నా.. హిందీని మాత్రం త్రిభాషా సూత్రంలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డారు. ఆయా రాష్ట్రాలు, ప్రాంతాలు హిందీని వద్దనుకున్నప్పుడు ఇలాంటి దోరణులు తీసుకోవడం అవసరమా అని కేంద్ర ప్రభుత్వాన్ని, మహారాష్ట్ర సర్కార్ ను ప్రశ్నించారు.
భిన్నాభిప్రాయాలు ఖాయం.. కానీ
పోషకాహార లోపం రేటును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. మరాఠీ భాషా సమస్యపై ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేల మధ్య ఐక్యతను ఆమె ప్రశంసించారు. వారి సయోధ్య మరాఠీ సమాజానికి ఆనందాన్ని తెస్తుందని మహారాష్ట్ర మూలాలతో బలమైన సంబంధాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. 20 సంవత్సరాల రాజకీయ సంఘర్షణ కారణంగా విడిపోయిన ఠాక్రే సోదరులు, MNS, శివసేన UBT చీఫ్ రాజ్ ఉద్ధవ్ ఠాక్రే 20 ఏళ్ల తర్వాత కలిసి ముంబైలోని వర్లీలో పాఠశాలల్లో హిందీ వద్దని ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నేషనలిస్ట్ కాంగ్రెస్ నాయకురాలు సుప్రియ సూలే పాల్గొన్నారు.






