- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోదేశంపై ట్రంప్ టారిఫ్ బెదిరింపులు.. లొంగబోమన్న అధ్యక్షుడు
తాను అనుకున్నది జరగకపోతే అందుకు కారణమవుతున్న దేశాలపై టారిఫ్ ల బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా గాజా శాంతిమండలిలో చేరాలన్న ట్రంప్ ఇన్విటేషన్ ను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ రిజెక్ట్ చేశారు. దీంతో ఆగ్రహంచిన ట్రంప్ ఫ్రాన్స్ పై 200 శాతం టారిఫ్ లు విధిస్తానని బెదిరించారు.

దిశ, వెబ్‌డెస్క్: గాజాలో శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ శాంతి మండలి ఛైర్మన్ కూడా ఆయనే. ఇందులో చేరాల్సిందిగా భారత్ సహా కొన్ని దేశాలను ఆహ్వానించారు. అయితే ఈ మండలిలో చేరడం, చేరకపోవడం ఆయా దేశాల నిర్ణయానికి వదిలేయలేదు. మండలిలో చేరని దేశాలపై ట్రంప్ టారిఫ్ లు విధిస్తున్నారు. తాను అనుకున్నది జరగకపోతే అందుకు కారణమవుతున్న దేశాలపై టారిఫ్ ల బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా గాజా శాంతిమండలిలో చేరాలన్న ట్రంప్ ఇన్విటేషన్ ను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ రిజెక్ట్ చేశారు. దీంతో ఆగ్రహంచిన ట్రంప్ ఫ్రాన్స్ పై 200 శాతం టారిఫ్ లు విధిస్తానని బెదిరించారు. ఫ్రాన్స్ వైన్, షాంపైన్ దిగుమతులపై టారిఫ్లు ఉంటాయని వెల్లడించారు. ఈ టారిఫ్ తర్వాత మండలిలో చేరాల్సిన అవసరం లేదన్నారు.
ఈ విషయంలో మెక్రాన్ నుంచి వచ్చిన పర్సనల్ మెసేజులను కూడా ట్రంప్ షేర్ చేశారు. ఇరాన్ - సిరియా విషయంలో తాము ఏకాభిప్రాయంతో ఉన్నామని, గ్రీన్ లాండ్ విషయంలో మాత్రం ఏం చేస్తున్నారో అర్థంకావడం లేదని మెక్రాన్ ఆ మెసేజ్ లో పేర్కొన్నారు. దావోస్ లో సమావేశం తర్వాత పారిస్ లో జీ7 మీటింగ్ ఏర్పాటు చేస్తానని, అమెరికా వెళ్లడానికి ముందు ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దామని మెక్రాన్ ట్రంప్ ను కోరారు. కానీ అందుకు ట్రంప్ సిద్ధంగా లేరని టారిఫ్ హెచ్చరికలతో స్పష్టమైంది. గ్రీన్ లాండ్ విషయంలో తమకు మద్దతుగా లేని దేశాలపై 10 శాతం ఎక్స్ ట్రా టారిఫ్ లు విధిస్తామని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ పై 200 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు.






