- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో 30, 40 ఏళ్లు జీవించి ప్రజలకు సేవ చేయాలనుంది: దలైలామా
టిబెటియన్ల ఆధ్మాత్మిక గురువు దలై లామా తన వారసుడిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. తాను ఇంకా 30 నుండి 40 సంవత్సరాలు జీవించి, ప్రజలకు సేవ చేయాలనే ఉందని వెల్లడించారు.

దిశ, నేషనల్ బ్యూరో: టిబెటియన్ల ఆధ్మాత్మిక గురువు దలై లామా తన వారసుడిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. తాను ఇంకా 30 నుండి 40 సంవత్సరాలు జీవించి, ప్రజలకు సేవ చేయాలనే ఉందని వెల్లడించారు. ఆదివారం జరిగే తన 90వ పుట్టినరోజు పురస్కరించుకుని శనివారం మెక్‌లియాడ్‌గంజ్‌లోని సుగ్లగ్‌ఖాంగ్ లో దలై లామా మందిరంలో నిర్వహించిన దీర్ఘాయుష్క ప్రార్థన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దేవుడి ఆశీర్వాదాలు తనపై ఉన్నాయని, ప్రవచనాలు కూడా దీన్ని సమర్థిస్తున్నాయని తెలిపారు. ‘ఇప్పటివరకు నా వంతు సేవ చేశాను. మీ ప్రార్థనల వలనే ఇది సాధ్యమైందని భావిస్తున్నాను’ అని అన్నారు.
ధర్మశాల ప్రవాసంతో ప్రజలకు సేవ
టిబెట్ ను కోల్పోయినా.. ధర్మశాల ప్రవాస జీవితం ద్వారా అనేక మంది ప్రజలకు మేలు చేసే అవకాశం లభించిందని తెలిపారు. తాను ఇక ముందు కూడా ప్రజలకు తోడుగా ఉండేందుకు తన శక్తి మేరకు సేవ చేయాలని సంకల్పించారు. వారసత్వంపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మొన్నటి వరకు దలై లామా వారసుడి ఎంపిక జరగనుందనే వార్తలు వినిపించాయి. చైనా కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించిందని సమాచారం. ఇలాంటి సమయంలో దలై లామా మరో 30, 40 ఏళ్లు తానే సేవ చేయాలనుందని చెప్పడంతో కొత్త దలై లామా ఎవరనే దానిపై చర్చకు తెరపడినట్లయింది.






