నాకు మరాఠీ రాదు.. దమ్ముంటే నన్ను మహారాష్ట్ర నుంచి తరిమేయండి: భోజ్ పురి యాక్టర్, ఎంపీ దినేశ్ లాల్

by Shamantha N |

భోజ్‌పురి సూపర్‌స్టార్ బీజేపీ ఎంపీ అయిన దినేష్ లాల్ యాదవ్ అలియాస్ నిరాహువా ఇటీవల మహారాష్ట్రలో మరాఠీ భాష వ్యవహారంపై జరిగిన వివాదంపై తీవ్రంగా స్పందించారు.

నాకు మరాఠీ రాదు.. దమ్ముంటే నన్ను మహారాష్ట్ర నుంచి తరిమేయండి: భోజ్ పురి యాక్టర్, ఎంపీ దినేశ్ లాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: భోజ్‌పురి సూపర్‌స్టార్ బీజేపీ ఎంపీ అయిన దినేష్ లాల్ యాదవ్ అలియాస్ నిరాహువా ఇటీవల మహారాష్ట్రలో మరాఠీ భాష వ్యవహారంపై జరిగిన వివాదంపై తీవ్రంగా స్పందించారు. ‘నాకు మరాఠీ రాదు.. దమ్ముంటే నన్ను మహారాష్ట్ర నుంచి తరిమేయండి’ అంటూ ఆయన రాజకీయ పార్టీలకు బహిరంగంగా సవాల్ విసిరారు. మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడనందుకు వ్యక్తులపై దాడులు జరుగుతున్న ఘటనల నేపథ్యంలో రాజకీయాలు మురికిగా మారిపోయాయన్నారు.

ఎవరి భాషా సామర్థ్యం వారిదే..

తన తాజా చిత్రం ‘హమర్ నామ్ బా కన్హయ్య’ ప్రమోషన్ సందర్భంగా నిరాహువా మాట్లాడుతూ.. భారతదేశం అనేక భాషలు, సంస్కృతుల సమ్మేళనం అన్నారు. ‘ఇలాంటి మురికి రాజకీయాలు దేశంలోని ఏ ప్రాంతంలోనూ జరగకూడదు. ప్రజల మధ్య భాషా వివాదాలు రేపే వారు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారతారు. ఎవరి భాషా సామర్థ్యం వారిదే. బలవంతంగా ఎవరికీ భాషలు నేర్పించకూడదు’ అని హెచ్చరించారు.నిరాహువా మరాఠీ భాషను అందమైనదిగా వర్ణిస్తూ.. ప్రతి వ్యక్తి వీలైతే ఎక్కువ భాషలు నేర్చుకోవాలి. నేర్చుకోలేకపోయినా వారిని లక్ష్యంగా చేసుకోకూడదు. ఇది ప్రజల స్వేచ్ఛకు వ్యతిరేకం అన్నారు. నేను రాజకీయ నాయకుడిని ‘నా నమ్మకం ప్రజల సంక్షేమం మీద ఉండాలి గానీ, వారిని భయపెట్టి నియంత్రించడంలో కాదు ’ అని చెప్పారు.

ఇటీవల మరాఠీ మాట్లాడాలని దాడులు

ఇటీవల మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) కార్యకర్తలు ముంబై సమీపంలోని మీరా రోడ్ ప్రాంతంలో ఒక రెస్టారెంట్ యజమానిపై మరాఠీ మాట్లాడలేదని దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై స్పందించిన నటుడు రణ్‌వీర్ షోరే ఇది బాధాకరం అన్నారు. ప్రజలను భయపెట్టే రాక్షసుల్లా రాజకీయ గూండాలు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతల పరిస్థితి ఏమైపోయింది అంటూ ట్వీట్ చేశారు. మరాఠీ భాషా విధానాన్ని బహిరంగంగా ప్రశ్నించిన పెట్టుబడిదారుడు సుశీల్ కేడియా కార్యాలయాన్ని వర్లీలో గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇది (MNS) చీఫ్ రాజ్ ఠాక్రేపై ఆయన చేసిన వ్యాఖ్యలకి ప్రతీకార చర్యగా భావిస్తున్నారు.ఈ పరిణామాలన్నీ భాషా పేరుతో చేస్తున్న రాజకీయాలు ప్రజల స్వేచ్ఛను హరించడమేనని విమర్శకులు భావిస్తున్నారు. భారతదేశం ఒక సాంస్కృతిక విభిన్నతకు ప్రతీకగా నిలవాలని, భాషకు గౌరవం ఇవ్వడం పేరుతో దాడులను ప్రోత్సహించవద్దని కోరుతున్నారు.

Next Story