- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో గవర్నర్‌గా హైదరాబాదీ... ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?
అమెరికాలో హైదరాబాదీ మహిళ చరిత్ర సృష్టించింది. వర్జీనియా స్టేట్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా భారత సంతతి మహిళ గజాలా హష్మీ విజయం సాధించింది. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా గజాలా ప్రచారం చేయగా, వర్జీనియాకు తొలి మహిళ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికై రికార్డు క్రియేట్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో హైదరాబాదీ మహిళ చరిత్ర సృష్టించింది. వర్జీనియా స్టేట్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా భారత సంతతి మహిళ గజాలా హష్మీ విజయం సాధించింది. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా గజాలా ప్రచారం చేయగా, వర్జీనియాకు తొలి మహిళ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికై రికార్డు క్రియేట్ చేసింది. అంతే కాకుండా వర్జీనియా రేసులో గెలిచిన తరవాత అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికైన తొలి భారత సంతతికి చెందిన ముస్లిం మహిళ కూడా ఈవిడే కావడం విశేషం. ఇక గజాలా హష్మీ మూలాలు హైదరాబాద్ లోనే ఉన్నాయి.
నగరంలోని మలక్ పేటలో 1964లో ఆమె జన్మించారు. చిన్నప్పుడు మలక్ పేటలోని తన అమ్మమ్మ ఇంటివద్దనే గజాలా ఉండేవారట. ఆమె తాత ప్రభుత్వ ఉద్యోగం చేసినట్టు తెలుస్తోంది. గజాలాకు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె కుటుంబం అమెరికాకు పయనం అయింది. గజాలా తండ్రి అంతర్జాతీయ వ్యవహారాల్లో పీహెచ్డీ చేయగా ఓ ప్రసిద్ధ యూనివర్సిటీలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు.
ఇక చదువుల్లో రాణించిన గజాలా జార్జియా సదర్ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్ చదివారు. అంతేకాకుండా తరవాత ఎమరి యూనివర్సిటీ నుండి సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. తరవాత అజహర్ అనే వ్యక్తితో వివాహం జరగ్గా 2019 ఎన్నికల్లో తొలిసారి అమెరికా ఎన్నికల్లో విజయం సాధించారు. అంతే కాకుండా అమెరికాలో తుపాకీ హింసకు వ్యతిరేకంగా బహిరంగంగా గజాలా తన గళాన్ని విప్పారు. ఆయుధాల నిషేదంపై కఠినమైన నియమాలను అమలు చేయాలన్నారు. ఇక 30 ఏళ్ల క్రితం అజహర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా వీరికి యాస్మిన్, నూర్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.






