‘హురున్’ ప్రపంచ సంపన్నుల జాబితా విడుదల.. ముఖేష్ అంబానీ ఏ స్థానంలో ఉన్నారంటే?

by Disha Web Desk 1 |
‘హురున్’ ప్రపంచ సంపన్నుల జాబితా విడుదల.. ముఖేష్ అంబానీ ఏ స్థానంలో ఉన్నారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: హురున్ గ్లోబల్ రిచ్ సంస్థ ప్రపంచంలో సంపన్నుల జాబితాలను విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే... టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ 231 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా గత నాలుగేళ్లలో మూడోసారి అగ్రస్థానంలో నిలిచాడు. ఇక ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ $185 బిలియన్ల నికర విలువతో రెండో స్థానంలో ఉన్నారు. ఎల్‌వీఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ $175 బిలియన్ల నికర విలువతో మూడో స్థానానికి పడిపోయారు. ఇక మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ $158 బిలియన్ల సంపదతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.

ఒరాకిల్ చైర్మన్ లారీ ఎల్లిసన్ $144 బిలియన్ల సంపదతో ఐదో స్థానంలో నిలిచారు. బెర్క్‌షైర్ హాత్వే చైర్మన్, వారెన్ బఫెట్ $144 బిలియన్ల నికర విలువతో ఆరో స్థానంలో నిలిచారు. అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్, ఇన్వెస్టర్ స్టీవ్ బాల్మెర్ $143 బిలియన్లతో ఏడో స్థానంలో నిలిచారు. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్‌గేట్స్ $138 బిలియన్ డాలర్ల నికర విలువతో జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచారు. $123 బిలియన్ల నికర విలువతో, గూగుల్ మాజీ సీఈవో లారీ పేజ్ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మరియు ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ $115 బిలియన్ల నికర విలువతో పదో స్థానంలో నిలిచారు.


Next Story

Most Viewed