- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైనా అధ్యక్షుడికి భారీ షాక్.. అత్యంత నమ్మకస్థుడైన అధికారిపై వేటు
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Chinese President Xi Jinping) భారీ షాక్ తగిలింది.

దిశ, వెబ్ డెస్క్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Chinese President Xi Jinping) భారీ షాక్ తగిలింది. అతడికి అత్యంత నమ్మకస్థుడు, శక్తివంతమైన అధికారిపై వేటు పడింది. సెంట్రల్ మిలిటరీ కమిషన్ (CMC) సభ్యుడిగా ఉన్న జనరల్ మియా హువును తొలగించినట్టు చైనా పార్లమెంట్ ప్రకటించింది. ఈ వార్తను అధికారిక షిన్హువా న్యూస్ ఏజెన్సీ జూన్ 27న వెల్లడించింది. మియా హువుపై గత నవంబర్‌లోనే క్రమశిక్షణా ఉల్లంఘనల ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభమైంది. దర్యాప్తు అనంతరం ఆయనను సెంట్రల్ మిలిటరీ కమిషన్‌తో పాటు చైనా శాసనసభ సభ్యత్వం నుంచి కూడా తొలగించారు. మియా హువు, మిసైల్ ఫోర్స్‌కు చెందిన ఉన్నతాధికారి కాగా, జిన్‌పింగ్‌కు అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరుగాంచారు. ఈ పరిణామం జిన్‌పింగ్ నేతృత్వంలోని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో జరుగుతున్న అంతర్యుద్ధాలను సూచిస్తోందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.






