కెమికల్‌ ఫ్యాక్టరీలో ఒళ్లు గగుర్పొడిచే పేలుడు.. భారీగా ఎగిసిపడిన పొగ

by Yella Dhawani Reddy |

చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌లోని గౌమీ నగరంలో మంగళవారం మధ్యాహ్నం భారీ ప్రమాదం సంభవించింది.

కెమికల్‌ ఫ్యాక్టరీలో ఒళ్లు గగుర్పొడిచే పేలుడు.. భారీగా ఎగిసిపడిన పొగ
X

దిశ, వెబ్ డెస్క్: చైనాలోని (China) షాన్డాంగ్ (Shandong) ప్రావిన్స్‌లోని గౌమీ నగరంలో మంగళవారం మధ్యాహ్నం భారీ ప్రమాదం జరిగింది. యోడావో కెమికల్ కంపెనీ (Youdao Chemical factory) వర్క్‌షాప్‌లో ఒళ్లు గగ్గుర్పొడిచే పేలుడు సంభవించింది . ఈ కంపెనీ పురుగుమందులు, ఔషధాలకు ఉపయోగించే రసాయనాలను తయారు చేస్తుంది. పేలుడు కారణంగా దట్టమైన నలుపు, నారింజ రంగులో పెద్దఎత్తున పొగ ఆకాశంలోకి ఎగిసిపడింది. పక్కనున్న గ్రామాల్లోని కిటికీలు పగిలిపోయాయి. ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక స్థానిక నివాసితులు భయంతో బయటకు పరుగులు తీశారు.

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే.. 232 మంది ఫైర్‌ఫైటర్లు, 55 వాహనాలు, వైద్య నిపుణులు, అత్యవసర నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాద స్థాయిని తగ్గించేందుకు రెస్క్యూ బృందాలు కృషి చేస్తున్నాయి. పేలుడు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇక ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం, గాయాలపై అధికారిక సమాచారం లేదు. కాగా, ఇలాంటి ఘటనలు చైనాలో గతంలో కూడా సంభవించాయి.

Next Story