- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూలిన భారీ బ్రిడ్జ్.. 12 మంది మృతి?
758 మీటర్ల ఎత్తులో ఉన్న బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలడంతో 12 మంది మృతి చెందినట్లు సమాచారం.

దిశ, వెబ్‌డెస్క్: భారీ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలడంతో 12 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన డ్రాగన్ కంట్రీగా పేరొందిన చైనాలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ౭౫౮ మీటర్ల ఎత్తులో ఉన్న ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవం జరిగిన నెలల వ్యవధిలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మృతులు, క్షతగాత్రుల విషయంపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో హాంగ్కీ వంతెనలోని ఒక భాగం కుప్పకూలింది. కొండచరియలు బ్రిడ్జిపై విరిగిపడటంతోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రముఖ వార్తాసంస్థ రాయిటర్స్ పేర్కొన్న వివరాల ప్రకారం.. మధ్య చైనాను టిబెట్ తో కలిపే జాతీయ రహదారి వెంబడి ఉన్న హాంగ్కీ వంతెన నిన్న (నవంబర్ 11) మధ్యాహ్నం పాక్షికంగా కూలిపోయింది. ఆ సమయంలో వెలువడిన దుమ్ము.. ఆకాశాన్ని మేఘాల మాదిరిగా కప్పివేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని, కొండచరియలు విరిగిపడటమే ఇందుకు కారణమా ? లేక నిర్మాణ లేదా ఇంజనీరింగ్ లోపాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేయాలని ఆదేశించినట్లు ప్రభుత్వం తెలిపింది.






