- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇజ్రాయెల్‌పై 100+ రాకెట్లతో హెజ్బొల్లా దాడి
ఇజ్రాయెల్ వైపు ఏక కాలంలో దాదాపు 100 రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది హిజ్బుల్లా.

దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్ ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఏకంగా 100కు పైగా రాకెట్లతో హెజ్బొల్లా ( Hezbollah) దాడి చేసింది. 100 రాకెట్లతో పాటు డ్రోన్లను కూడా ఉత్తర ఇజ్రాయెల్ లక్ష్యంగా ప్రయోగించింది హెజ్బొల్లా. ఇక ఈ భారీ రాకెట్ దాడికి ఆపరేషన్ ఈటెన్ స్ట్రా అనే నామకరణం కూడా చేసింది. ఈ దాడులను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికారికంగా ధ్రువీకరించాయి. అయితే హెజ్బొల్లా దాడులకు ఇజ్రాయెల్ ప్రతి దాడి కూడా ప్రారంభించింది.
లెబనాన్ రాజధాని బీరుట్ లోని దహీహ్ ప్రాంతంలో ఉన్న హెజ్బొల్లా మౌలిక సదుపాయాలపై తాము పెద్ద ఎత్తున దాడులు ప్రారంభించినట్లు పేర్కొంది ఇజ్రాయెల్. మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై మిసైల్స్ దాడిని కొనసాగిస్తోంది. దీంతో 12వ రోజు యుద్ధం మరింత ఉధృతంగా మారింది. ఇది ఇలా ఉండగా ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరాన్ కు మద్దతుగా ఉన్న హెజ్బొల్లా దాడులకు పాల్పడుతోంది.






