Uber Helicopter: ఇకపై ఉబర్‌లో హెలికాప్టర్‌ బుకింగ్స్..! వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చే చాన్స్

by Ramesh Naini |   (  Updated:2025-09-15 13:01:19  IST  )

ప్రముఖ దిగ్గజ టాక్సీ సేవలందించే యాప్ ఉబర్‌(Uber)లో కొత్త సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

Uber Helicopter: ఇకపై ఉబర్‌లో హెలికాప్టర్‌ బుకింగ్స్..! వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చే చాన్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ దిగ్గజ టాక్సీ సేవలందించే యాప్ ఉబర్‌(Uber)లో కొత్త సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు కారు, బైక్, ఆటో మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉండేది. వీటితో పాటు యాప్‌లో హెలికాప్టర్ బుకింగ్స్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. గతంలో ఈ సర్వీస్ కేవలం ఇటలీలో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో హెలికాప్టర్ రైడ్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.

ఉబర్‌లో కస్టమర్లకు హెలికాప్టర్ రైడ్‌లను అందించాలని యోచిస్తున్నామని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన కంపెనీ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. దీని కోసం, ఉబర్ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీల తయారీ సంస్థ జాబీ ఏవియేషన్‌తో జతకట్టి వచ్చే ఏడాది (2026)లో సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. జోబీ బ్లేడ్ ఎయిర్ మొబిలిటీని $125 మిలియన్ల ఒప్పందంలో భాగంగా ఈ విషయం చోటుచేసుకుంది. ఈ అంశంపై జాబీ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన జోబెన్ బెవిర్ట్ మాట్లాడుతూ.. ఉబర్ కస్టమర్లకు విమాన ప్రయాణాన్ని పరిచయం చేయడానికి తాము ఉత్సాహంగా ఉన్నామని వెల్లడించారు. జోబీ ప్రతినిధి సీబీఎస్ మనీవాచ్‌తో మాట్లాడుతూ.. రూట్లు, ధరల గురించి కంపెనీ ఇంకా ఖరారు చేయలేదని, అయితే విమానాశ్రయ కనెక్షన్లు వినియోగదారులకు ఆకర్షణీయంగా ఉంటాయని తెలిపారు.లింక్..

Next Story