- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిమచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు, వరదలు.. 69 మంది మృతి
హిమచల్ ప్రదేశ్ లో జూన్ 20 నుంచి జులై 3 వరకు కురిసిన భారీ వర్షాలకు ఇప్పటి వరకు 69 మంది చనిపోయారు.

దిశ, నేషనల్ బ్యూరో: హిమచల్ ప్రదేశ్ లో జూన్ 20 నుంచి జులై 3 వరకు కురిసిన భారీ వర్షాలకు ఇప్పటి వరకు 69 మంది చనిపోయారు. ఈ నెల 9 వరకు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ ర్కొంది. భారీ వర్షాలు, వరదలతో హిమచల్ ప్రదేశ్ మొత్తం అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలు, వరదలతో ఇప్పటికే రూ. 400 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ఆ రాష్ట్ర విపత్తు శాఖ తెలిపింది. మండి, కాంగ్రా, చంబా జిల్లాలో వర్ష బీభత్సం ఎక్కువగా ఉంది. మండి జిల్లాలో 17 మంది, కాంగ్రాలో 13, చంబాలో ఆరుగురు చనిపోగా, సిమ్లాలో అయిదుగురు మరణించారు. మండి, తునాగ్, బాగ్సాయెద్ లో పెద్ద ఎత్తున్న వర్షాలు కురుస్తుండగా ఇప్పటి వరకు 40 మంది గల్లంతయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 119మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది.
విద్యుత్ సరఫరాకు అంతరాయం.. వేల మంది చీకట్లో
వరదల్లో అనేక ఇళ్లు కొట్టుకుపోయాయని, 14 వంతెనలు ధ్వంసం అయ్యాయని ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వేల మంది చీకట్లో మగ్గుతున్నారు. అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతుండటంతో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వంతెనలు కూలి, రోడ్లు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటకం కలుగుతోంది.






