- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎడారి దేశంలో భారీ వర్షాలు.. పర్యాటక ప్రాంతాలు మూసివేత
ఏడాది దేశాల్లో UAE కూడా ఒకటి. ప్రస్తుతం అక్కడ భారీ వర్షాలు కురుస్తుండంతో

దిశ, వెబ్‌డెస్క్: ఏడాది దేశాల్లో UAE కూడా ఒకటి. ప్రస్తుతం అక్కడ భారీ వర్షాలు కురుస్తుండంతో జనజీవనం స్తంభించింది. అబుదాబీ, దుబాయ్ సహా పలు నగరాల్లో కొన్ని గంటలపాటు వర్షాల ధాటికి జనజీవనం స్తంభించింపోయింది. రోడ్లు జలమయమవ్వడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. కొన్ని విమాన సర్వీసుల రాకపోకలకు సైతం అంతరాయం కలిగింది. ఇయర్ ఎండ్ హాలిడే సీజన్ కు సిద్ధమవుతున్న క్రమంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమయింది.
దుబాయ్, అబుదాబీల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని దుబాయ్ ప్రభుత్వం ఆదేశించింది. బీచ్ లు, పార్కులు, పర్యాటక ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేసింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, వరద తీవ్రతను తక్కువగా అంచనా వేయొద్దని షార్జా సివిల్ డిఫెన్స్ అథారిటీ (SCDA) సూచించింది. మరోవైపు దోహా, ఖతార్ లలోనూ భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ప్రయాణికులు ట్రావెల్ అడ్వైజరీలను పాటించాలని అధికారులు కోరుతున్నారు.






