- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్ట్ గ్యాలరీలో అరుదైన వస్తువుతో ఫొటో దిగాలనుకున్నాడు.. కానీ, జరిగింది చూస్తే షాకవుతారు!
నేషనల్ మ్యూజియంలలో అరుదైన కళాఖండాలను సందర్శకుల కోసం ఎంతో శ్రద్ధగా ప్రదర్శనకు పెడుతుంటారు.

దిశ, వెబ్ డెస్క్: నేషనల్ మ్యూజియంలలో అరుదైన కళాఖండాలను సందర్శకుల కోసం ఎంతో శ్రద్ధగా ప్రదర్శనకు పెడుతుంటారు. ఇవి కేవలం కళా వస్తువులు మాత్రమే కాదు.. ఇవి మన సంస్కృతి, చరిత్ర, కళాత్మక విలువల తెలియజేసే సంపదలు. అలాంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలో మరిచిపోతే.. ఒక చిన్న నిర్లక్ష్యంతో ఏ విధమైన నష్టం జరుగుతుందో తాజా సంఘటన తెలియజేస్తోంది.
ఇటలీలోని వెరోజా నగరంలోని ప్రసిద్ధ పలాజ్జో మాఫ్ఫెయ్ (Palazzo Maffei) ఆర్ట్ మ్యూజియంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఒక పర్యాటకుడు అక్కడ ప్రదర్శింపబడుతున్న విలువైన 'వాన్ గో కుర్చీ' అనే అద్భుత కళాఖండాన్ని ధ్వంసం చేశాడు. దీనిని ప్రముఖ డచ్ చిత్రకారుడు విన్‌సెంట్ వాన్ గోకు అంకితంగా.. ఇటలీకి చెందిన ప్రఖ్యాత కళాకారుడు నికోలా బొల్లా రూపొందించారు. ఈ కళాఖండం పూర్తిగా స్వరోవ్‌స్కీ క్రిస్టల్స్‌తో ముస్తాబై, అత్యంత సున్నితంగా ఉంటుంది.
పర్యాటకుడు తనతో వచ్చిన మహిళతో కలిసి కుర్చీ పక్కన ఫోటో దిగేందుకు ముందుగా నటించాడు. ఆపై, నిజంగా కూర్చోవడానికి ప్రయత్నించగా కుర్చీ ఒక్కసారిగా విరిగిపోయింది. బ్యాలెన్స్ కోల్పోయిన అతను పడిపోతుండగా, వెంటనే ఆ మహిళ అతన్ని లేపింది. కానీ వారు ఈ ఘటనను మ్యూజియం సిబ్బందికి తెలియజేయకుండా, అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వటంతో.. ఈ ఘటనపై మ్యూజియం వారు తీవ్రంగా స్పందించారు. అంతేకాదు, మ్యూజియం ఈ ఘటనను కేవలం తెలియజేయడానికే కాకుండా, కళా సంపదకు గౌరవం ఇవ్వాల్సిన అవసరంపై ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ప్రచారం మొదలు పెట్టింది. ఇక తొలుత మ్యూజియం సిబ్బంది ఈ కళాఖండాన్ని తిరిగి పునరుద్ధరించగలమా అనే అనుమానంతో ఉన్నారు. కానీ, తరువాత వారు దానిని విజయవంతంగా పునరుద్ధరించినట్టు తెలిపారు.
ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 'ఇప్పుడు చాలామంది మ్యూజియాలకు సాంస్కృతిక విలువ కోసం కాదు, సెల్ఫీలు తీసుకోవడానికే వస్తున్నారు. అదే ఈ నిర్లక్ష్యానికి కారణం' అంటూ కొందరు, 'అది పొరపాటున జరిగినా.. వారు మ్యూజియం వారికి తెలియజేయకపోవటం విచారకరం' అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.






