మళ్లీ మొదటికి వచ్చిన గాజా యుద్ధం

by Ajay Maddhiboyina |

గాజా యుద్ధం మళ్లీ మొదటికి వ‌చ్చింది. మరోసారి రఫాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఖాన్‌ యూనిస్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 29 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. మ‌ర‌ణించిన‌వారిలో పిల్ల‌లు కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ర‌

మళ్లీ మొదటికి వచ్చిన గాజా యుద్ధం
X

దిశ‌, వెబ్ డెస్క్: గాజా యుద్ధం మళ్లీ మొదటికి వ‌చ్చింది. మరోసారి రఫాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఖాన్‌ యూనిస్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 29 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. మ‌ర‌ణించిన‌వారిలో పిల్ల‌లు కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ర‌ఫాలో హ‌మాస్ ఉగ్ర‌వాదులు త‌మ ద‌ళాల‌పై మెరుపు దాడి చేసి ఇద్ద‌రు సైనికుల‌ను చంపారని ఆరోపించిన త‌ర‌వాత ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్ప‌డింది. కాల్పుల విర‌మ‌ణ చ‌ర్చ‌ల్లో పాల్గొన్న సీనియ‌ర్ అధికారి మాట్లాడుతూ.. ప‌రిస్థితి అదుపు చేయ‌డానికి 24 గంట‌లూ సంప్ర‌దింపులు జ‌రుగున్నాయ‌ని చెప్పారు. ఇదిలా ఉంటే ఇటీవ‌లే ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. వారం రాజులు కాకముందే మళ్లీ యుద్ధం మొదలవ్వడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

Next Story