- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో వింత వాతావరణం.. క్రికెట్ బంతి కంటే పెద్ద సైజులో వడగళ్లు
గత కొద్ది రోజులుగా ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాల్లో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఎవరూ ఊహించిన విధంగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాల్లో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఎవరూ ఊహించిన విధంగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్, సౌత్ ఈస్ట్ క్వీన్స్‌ల్యాండ్ ప్రాంతాలు ప్రకృతి కోపానికి కొద్ది రోజులుగా గురవుతున్నాయి. భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో గతంలో ఎన్నడూ చూడని విధంగా క్రికెట్ బంతి కంటే పెద్ద సైజులో వడగళ్ల వర్షం కురుస్తుంది. ఈ రోజు ఉదయం కూడా ఇలానే దాదాపు 9 సె. మీ సైజులో ఉన్న వడగళ్ల వర్షం కురిసింది. దీంతో ఆ ప్రాంతంలోని పలు ఇళ్ల పైకప్పులు దెబ్బతిన్నాయి, వాహనాల గాజులు పగిలిపోయాయి, చెట్లు నేలకొరిగాయి. ఈ భారీ సైజు వడగళ్ల వానలో కనీసం 9 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
దీంతో అప్రమత్తం అయిన స్థానిక ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎమర్జెన్సీ సేవలు యాక్టివ్ చేసింది. ఈ అప్రతిహత వాతావరణ మార్పు కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాతావరణ శాఖ (Bureau of Meteorology) “Very Dangerous Thunderstorm Warning” జారీ చేస్తూ ప్రజలు ఇంట్లోనే ఉండాలని, వాహనాలను ఆవరణల కింద ఉంచాలని హెచ్చరించింది. గాలి వేగం గంటకు 100 కిమీ. వరకు నమోదవడంతో అనేక చోట్ల విద్యుత్ తీగలు తెగిపోయాయి. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సహాయ కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.
వాతావరణ నిపుణుల ప్రకారం.. ఈ తుపాను “సూపర్‌సెల్ స్టార్మ్” రూపంలో ఏర్పడింది. వేడిగా ఉన్న గాలి, తేమ కలిసిపోవడంతో వడగళ్ల వాన తీవ్ర స్థాయికి చేరింది. మైసూర్, టువుంబా, ప్రాటెన్ ప్రాంతాల్లో అత్యధికంగా నష్టం నమోదైంది. గత వారం రోజులుగా క్వీన్స్‌ల్యాండ్‌లో వింత వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయని, రాబోయే రోజుల్లో మరోసారి భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని స్థానిక వాతావరణ శాఖ హెచ్చరించింది.






