- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ పాఠశాల స్టూడెంట్ కు.. IIT-బాంబే ఏరోస్పేస్ లో సీటు
తమిళనాడు రాష్ట్రం విరుదునగర్ జిల్లాలోని మారుమూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే స్టూడెంట్ యోగేశ్వరీ IIT-బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ కోర్సులో సీటు లభించింది.

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు రాష్ట్రం విరుదునగర్ జిల్లాలోని మారుమూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే స్టూడెంట్ యోగేశ్వరీ IIT-బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ కోర్సులో సీటు లభించింది. ఆమె ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అనే పదం గురించి తెలియని స్థితి నుంచి ఈ ఘనతను సాధించడం అసాధారణమైన విషయమని నిపుణులు కొనియాడుతున్నారు. తమిళనాడు రాష్ట్రం సాతూర్ గ్రామంలోని పదంతాల్ ప్రభుత్వ పాఠశాలలో యోగేశ్వరీ చదువుతోంది. యోగేశ్వరి తండ్రి టీ స్టాల్‌లో పనిచేస్తుండగా.. తల్లి క్రాకర్స్ ఫ్యాక్టరీలో కార్మికురాలిగా పనిచేస్తున్నారు. సీఎం స్టాలిన్ ప్రవేశపెట్టిన ‘నాన్ ముదల్‌వన్’ ‘కల్లూరి కనవు’ పథకాల ద్వారా JEE పరీక్షల గురించి యోగేశ్వరీ తెలుసుకుంది. JEE పరీక్ష ఎలా ఉంటుందో, దానికి ఎలా దరఖాస్తు చేయాలో ఓ కార్యక్రమంలో వారు చెప్పినట్లు యోగేశ్వరీ తెలిపింది. ఆ విధంగా JEE మెయిన్స్ క్లియర్ చేశానని విద్యార్థి పేర్కొంది. తర్వాత JEE అడ్వాన్స్డ్ కోచింగ్ ఇచ్చారు. ఇంగ్లీష్ లో టీచింగ్ వల్ల తొలుత కష్టం అనిపించింది. కానీ క్రమంగా నేర్చుకొని JEE అడ్వాన్స్డ్ పాస్ అయ్యానని ఆమె తెలిపింది. ఇప్పుడు ‘IIT బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో ప్రవేశం పొందినందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అని యోగేశ్వరి పేర్కొంది.
కలెక్టర్ అవగాహన కల్పించడంతో..
జిల్లా కలెక్టర్ వి.పి. జయశీలన్ ఉన్నత విద్యపై అవగాహన కల్పించారని, పరీక్షలకి ఎలా సిద్ధమవాలో నేర్చుకున్నట్లు యోగేశ్వరీ తెలిపింది. నాన్ ముదల్‌వన్, కల్లూరి కనవు పథకాల ద్వారా ఉన్నత విద్య అవకాశాల గురించి కలెక్టర్ తెలియజేశారని పేర్కొంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కలెక్టర్ జయశీలన్ కు యోగేశ్వరీ కృతజ్ఞతలు తెలియజేసింది. పేద కుటుంబాల పిల్లలకు ఈ పథకాలు వరం అని, సునీతా విలియమ్స్, కల్పనా చావ్లా వంటి ఏరోస్పేస్ రంగ నిపుణులను ఆదర్శంగా తీసుకున్నట్లు యోగేశ్వరీ పేర్కొంది.






