షాకింగ్.. నల్లుల బెడదకు మూతపడ్డ గూగుల్ ఆఫీస్

by Ajay Maddhiboyina |

న్యూయార్క్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నల్లుల బెడద ఎక్కువగా ఉందని మాన్ హట్టన్ చెల్సియా గూగుల్ క్యాంపస్ కార్యాలయాన్ని క్లోజ్ చేసి ఉద్యోగులకు వర్క్ ఫ్రం ఇచ్చేశారు. దీంతో కార్యాలయం తాత్కాలికంగా మూత పడగా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నట్టు మెయిల్స్ పంపించారు.

షాకింగ్.. నల్లుల బెడదకు మూతపడ్డ గూగుల్ ఆఫీస్
X

దిశ, వెబ్ డెస్క్: న్యూయార్క్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నల్లుల బెడద ఎక్కువగా ఉందని మాన్ హట్టన్ చెల్సియా గూగుల్ క్యాంపస్ కార్యాలయాన్ని క్లోజ్ చేసి ఉద్యోగులకు వర్క్ ఫ్రం ఇచ్చేశారు. దీంతో కార్యాలయం తాత్కాలికంగా మూత పడగా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నట్టు మెయిల్స్ పంపించారు. అంతే కాకుండా నల్లుల బాధ పోయే వరకు ఎవరూ ఆఫీస్‌కు రావద్దని పేర్కొన్నారు.

నల్లులను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని, ఆ తరవాతనే రావాలని తెలిపారు. ఉద్యోగులకు ఎవరికైనా దురద లాంటి లక్షణాలు ఉంటే వెంటనే తెలియజేయాలని మెయిల్ లో పేర్కొన్నారు. అంతే కాకుండా పనిచేసే సమయంలో ఎక్కడెక్కడ నల్లులు కనిపించాయో తెలపాలని కోరారు. నల్లుల బెడదతో గూగుల్ కార్యాలయమే మూతపడటంతో ఈ విషయం చర్చగా మారింది. అయితే ఆఫీసులో పెద్ద పెద్ద జంతువుల బొమ్మలు పెట్టడం వల్లనే నల్లులు ఎక్కువగా వస్తున్నాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

Next Story