- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'విదేశీ పర్యాటకుల'కు.. 'కిమ్' శుభవార్త..!
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.. విదేశీ పర్యాటకులకు శుభవార్త చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.. విదేశీ పర్యాటకులకు శుభవార్త చెప్పారు. ఉత్తర కొరియా లోని ఈశాన్య నగరమైన సంజియోన్ కి డిసెంబర్ నెల నుంచి అంతర్జాతీయ పర్యాటక రంగాన్ని పునః ప్రారంభించనున్నారు. దీంతో ఉత్తర కొరియాలో పర్యాటక రంగం పుంజుకునే అవకాశం ఉంది. దీంతో పాటుగా కొరియాలోని ఇతర ప్రాంతాలకు పర్యాటకాన్ని అనుమతించవచ్చని ఆ దేశ టూరిస్ట్ కంపెనీలు బుధవారం వెల్లడించాయి. కాగా కోవిడ్ సమయంలో కఠినమైన నిబంధనలు పెట్టిన కొరియా.. దేశ సరిహద్దులను పూర్తిగా మూసి వేసింది. గత ఐదు సంవత్సరాలుగా అంతర్జాతీయ పర్యాటకులను ఉత్తర కొరియా ప్రభుత్వం నిషేధించింది. ప్రస్తుతం కోవిడ్ తగ్గటంతో తమ దేశానికి తిరిగి పర్యాటకులను ఆహ్వానిస్తోంది. దీంతో నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న కొరియా టూర్స్ కు ప్రభుత్వం ముంచి ఈ ప్రకటన రావడంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది.
సంజియోన్ అనేది అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే అందమైన నగరం. ఈ నగరం చైనా సరిహద్దులకు చాలా దగ్గరగా ఉండే ప్రాంతం. ఈ ప్రదేశంలో రిసార్ట్స్, హోటళ్లు, అపార్టుమెంట్లు తిరిగి ప్రారంభించారు. అక్కడ మరో ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ కేటీజీ టూర్స్ సైతం.. ఈ శీతాకాలం నుండి పర్యాటకులను సంజియోన్ నగరానికి వెళ్లవచ్చని ఇప్పటికే ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే ఉత్తర కొరియాలోని ఇతర ప్రాంతాలకు మాత్రం.. అధికారికంగా 2024 డిసెంబర్ నుండి తిరిగి వెళ్లవచ్చని, తమ స్థానిక భాగస్వామి నుండి ధ్రువీకరణ కూడా పొందామని బీజింగ్ కు చెందిన కొరియా టూర్స్ తమ వెబ్ సైట్ లో పేర్కొంది. ఈ క్రమంలోనే రష్యాకు చెందిన పర్యాటకులు ఫిబ్రవరిలో ప్రైవేట్ పర్యటన కొరకు ఉత్తర కొరియాను సందర్శించారు. కాగా ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం ఆ దేశ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే






