- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పదేళ్లకే బిడ్డకు జన్మనిచ్చిన పాప.. (వీడియో)
* పదేళ్ల అమ్మాయిపై అంకుల్ రేప్ * విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరింపు * కానీ ప్రెగ్నెంట్ అయిన చిన్నారి.. బిడ్డకు జన్మనిచ్చిన పాప

దిశ, వెబ్ డెస్క్ : మానవత్వం మంట గలుస్తోంది. జాలి, దయ అనేవే లేకుండా ప్రవర్తిస్తున్నారు జనాలు. కనీసం చిన్న పిల్లలు అని కూడా చూడకుండా.. కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి కథే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆఫ్రికాకు చెందిన ఓ యువతి తన పదేళ్ల వయసులో జరిగిన విషయాన్ని కోర్టులో ప్రస్తావించింది. తనకు పదేళ్లు ఉన్నప్పుడు ఓ అంకుల్ తనను రేప్ చేశాడని తెలిపింది. కానీ ఈ విషయం తల్లిదండ్రులకు చెప్తే కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడని.. దీంతో తను ఎవరికీ ఈ ఘటన గురించి చెప్పలేదని వివరించింది. అక్కడితో ఆ విషయం వదిలేశానని చెప్పింది.
అయితే తను లావెక్కడం జరిగిందని.. ప్రెగ్నెన్సీ కారణంగా ఇలా జరుగుతుందని కూడా తనకు తెలియదని బాధపడింది. ఇలా సడెన్‌గా బరువెక్కడంతో తల్లి ఎక్సర్‌సైజ్ చేయమనేదని.. కానీ నెలలు గడుస్తున్నా వెయిట్ తగ్గకపోవడంతో.. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లిందని చెప్పింది. అప్పటికే తొమ్మిది నెలలు పడగా.. డెలివరీకి రెండు వారాల ముందు ఈ విషయం తమకు తెలిసిందని వివరించింది. అలా పదో ఏటనే తన బిడ్డకు జన్మనిచ్చానని వివరించింది.






