- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టుల మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు!
ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్‌లో చనిపోయిన 28 మంది మావోయిస్టుల మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేశారు. పోలీసులు సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు.

దిశ, వెబ్ డెస్క్: నారాయణపూర్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 28 మంది మావోయిస్టుల మృతదేహాలకు ఛత్తీస్ గఢ్ పోలీసులు అంత్యక్రియలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా 28 మంది అంత్యక్రియలు పూర్తి చేసినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్‌లో మొత్తం 28 మంది మావోయిస్టులు మరణించారు. అయితే వీరి మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు ఎంతగానో ఎదురుచూశారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన మావోయిస్టులను కడసారి చూసుకోవాలని కుటుంబ సభ్యులు ఎంత ఆరాట పడినా, కోర్టుకెళ్లి పోరాడినా ఫలితం దక్కలేదు.
మృతదేహాలు కుళ్లిన స్థితిలో ఉన్నాయని కాసేపు, తమ ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవని కాసేపు ఛత్తీస్ గఢ్ పోలీసులు సాకులు చెప్పారు. తమవారి మృతదేహాలను అప్పగించాలని పడిగాపులు పడి, ర్యాలీలు చేసినా.. ఏం చేస్కుంటారో చేస్కోండి అన్న చందంగా వ్యవహరించడంతో బాధిత కుటుంబాలు ఏమీ పాలుపోని స్థితిలో ఉండిపోయాయి. నంబాల కేశవరావు మృతదేహాన్ని అప్పగించాలని ఆయన కోర్టును సైతం ఆశ్రయించినా.. మృతదేహాలను అప్పగించకుండా ఛత్తీస్‌గఢ్ పోలీసులు, అధికారులు జాప్యం చేస్తున్నారని వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరిచూపుకు నోచుకోనివ్వకుండా పోలీసులు మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు నిర్వహించడం గమనార్హం.






