- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతరిక్షం నుంచి చూస్తే భారత్ అదుర్స్
2012లో భారత్ లో అందుబాటులో ఉన్న నైట్‌టైం శాటిలైట్ చిత్రాలు, గత పదేళ్లలో ఎలా మారిపోయిందో స్పష్టంగా చూపిస్తున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: 2012లో భారత్ లో అందుబాటులో ఉన్న నైట్‌టైం శాటిలైట్ చిత్రాలు, గత పదేళ్లలో ఎలా మారిపోయాయో స్పష్టంగా కనిపిస్తున్నాయి. విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్న నగరాలు, విస్తరిస్తున్న హైవేలు, గ్రామాలు ఇవన్నీ అభివృద్ధికి అద్దం పట్టే దృశ్యాలు. ఇవి కేవలం విద్యుతీకరణ గణాంకాల్ని కాదు, అభివృద్ధి పథంలో భారత ప్రయాణాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ 1990లలో లిబరలైజేషన్‌ను స్వీకరించిన తర్వాత దేశం సమగ్ర అభివృద్ధి దిశగా సాగిపోయింది. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, సమాచార సాంకేతిక విప్లవం వంటి అంశాలు కలసి ఈ మార్పులపై దోహదం చేశాయి. ఈ ఆధునిక రూపాంతరాన్ని అంతరిక్షం నుంచి వీక్షించే స్థాయిలోకి భారత్ చేరుకుంది.
అప్పుడు రాకేశ్ శర్మ.. ఇప్పుడు శుభాంశు శుక్లా
రాకేశ్ శర్మ1984లో అంతరిక్షం నుంచి చూసిన భారత్ ఎలా ఉండేదో మనం ఊహించవచ్చు. కానీ శుభాంశు శుక్లా 2025లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి చూస్తున్న భారత్ మాత్రం పూర్తిగా భిన్నంగా మారింది. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీతో రాకేశ్ శర్మ స్పేస్ నుంచి ‘సారే జహాసే అచ్చా’ అని చెప్పడం ప్రతి భారతీయ పౌరుడికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు శుభాంశు చేరే సరికి భారత్ మొత్తం వెలుగులీనుతూ స్పేస్ నుంచి చూస్తే దగదగ మెరిసిపోతుంది. 2012 నుంచి 2014 వరకు భారత్ ఎలా రూపాంతరం చెందిందో నైట్ లైట్ శాటిలైట్ చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. మధ్యలో కరోనాతో 2020లో కాస్త ప్రకాశవంతమైన వెలుతురు తగ్గినా ఆ తర్వాత మళ్లీ వెంటనే పుంజుకుంది.






