SHOCKING NEWS: ఇక నుంచి తలల మార్పిడి కూడా? నెట్టింట వైరలవుతోన్న షాకింగ్ వీడియో!

by Anjali |
SHOCKING NEWS: ఇక నుంచి తలల మార్పిడి కూడా? నెట్టింట వైరలవుతోన్న షాకింగ్ వీడియో!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటివరకు మనం ఎన్నో ట్రాన్స్ ప్లాంట్స్ చూశాం. హార్ట్ గానీ, కిడ్నీ గానీ ఇప్పటివరకు ఇలా చాలానే చేశారు. అయితే ఫ్యూచర్ లో తలల మార్పిడి కూడా జరగనుందట. ఈ వార్త విన్న జనాలకు ఆశ్చర్యంగా ఉందేమో కానీ అమెరికాలో ఇప్పటికే ఇలాంటి ఆవిష్కరణకు సంబంధించిన పనులు కూడా ప్రారంభించారు. ఒక మార్గదర్శక న్యూరోసైన్స్ , బయోమెడికల్ ఇంజనీరింగ్ స్టార్టప్ బ్రెయిన్‌బ్రిడ్జ్, ప్రపంచంలోనే మొట్టమొదటి తల మార్పిడి వ్యవస్థను అభివృద్ధి చేయడానికి తన సాహసోపేతమైన మిషన్‌ను ఆవిష్కరించింది. అంతేకాకుండా ఆ మెషిన్ ఎలా పని చేస్తుందని తెలియజేసేలా ఓ వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఈ రకం ప్రయోగాలను తాము సైంటిఫిక్ గా నిరూపించాలనుకుంటున్నామని బ్రెయిన్ బ్రిడ్జ్ వెల్లడించింది. స్టేజ్-4 క్యాన్సర్, పక్షవాతం, బలహీనపరిచే న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల వంటి అకారణంగా అధిగమించలేని పరిస్థితులతో బాధపడుతున్న రోగులకు ఈ హెడ్ ట్రాన్స్ ప్లాంట్ ఆశాజనకంగా ఉంటుందని వారు తెలిపారు. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి రోగులకు కూడా యూజ్ అవుతుందని పేర్కొన్నారు. ఎవరైన హెల్త్ ఇష్యూతో బాధపడుతుంటే వారి తలను ఇతర ఏ సమస్యలు లేకుండా కేవలం బ్రెయిన్ డెడ్ తో చనిపోయిన వారి బాడీకి ఎటాచ్ చేస్తారట. ఈ శస్త్ర చికిత్స చేసే రోబోలు.. రెండు బాడీలకు ఒకేసారి శస్త్ర చికిత్స చేయగలవట. హెడ్ మార్పిడి తర్వాత కూడా వారికి సంబంధించిన అన్ని విషయాలు గుర్తుంచేలా జాగ్రత్తలు తీసుకుంటారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Click Here For Twitter Post..

Next Story

Most Viewed