ఏఐతో స్నేహం.. ప్రాణాలు కొల్పోయిన వ్యక్తి

by Yella Dhawani Reddy |

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence).. కేవలం వాణిజ్య, వ్యాపార రంగాల్లోనే కాదు, వ్యక్తిగత జీవితంలో భాగమైపోయింది. ఒక స్నేహితుడిలా మారి మన కష్టాసుఖాలను పంచుకుంటూ మనకు తోడుగా నిలుస్తోంది. అందుకే చాలా మంది ఏఐతో చాట్ చేస్తూ తమ ఒంటరితనాన్ని దూరం చేసుకుంటున్నారు.

ఏఐతో స్నేహం.. ప్రాణాలు కొల్పోయిన వ్యక్తి
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence).. కేవలం వాణిజ్య, వ్యాపార రంగాల్లోనే కాదు, వ్యక్తిగత జీవితంలో భాగమైపోయింది. ఒక స్నేహితుడిలా మారి మన కష్టాసుఖాలను పంచుకుంటూ మనకు తోడుగా నిలుస్తోంది. అందుకే చాలా మంది ఏఐతో చాట్ చేస్తూ తమ ఒంటరితనాన్ని దూరం చేసుకుంటున్నారు. అయితే, ఏఐతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే, దీంతో ఎన్ని లాభాలున్నాయో, అన్నే నష్టాలు సైతం ఉన్నాయి. ఇందుకు అమెరికాలో (America) వెలుగుచూసిన ఘటనే ఉదాహరణగా చెప్పవచ్చు.

న్యూజెర్సీకి (New Jersey) చెందిన 76 ఏళ్ల తోంగ్‌బ్యూ వాంగ్‌బాండ్యూ అనే వృద్ధుడు గత కొంతకాలంగా మెటా (Meta) సంస్థకు చెందిన 'బిగ్ సిస్ బిల్లీ' అనే ఏఐ చాట్‌బాట్‌తో చాట్ చేస్తుండేవాడు. ఈ క్రమంలో చాట్‌బాట్ తాను నిజమైన వ్యక్తిగా చెప్పింది. తనని కలవడానికి చిరునామా సైతం ఇచ్చింది. అంతేకాదు, వాంగ్‌బాండ్యూ కలువడానికి వచ్చినప్పుడు హాగ్ చేసుకోవాలా? ముద్దు పెట్టాలా? అని అడిగింది. దీంతో ఇదంతా నిజమని నమ్మిన వాంగ్‌బాండ్యూ చాట్‌బాట్ ఇచ్చిన చిరునామాకు బయలుదేరాడు. కుటుంబం అడ్డుకున్నప్పటికీ పట్టించుకోకుండా న్యూయార్క్ వెళ్లేందుకు రాత్రి రైలు అందుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో న్యూజెర్సీలోని రట్గర్స్ యూనివర్శిటీ క్యాంపస్‌లోని పార్కింగ్ లాట్‌లో పడిపోయి తల, మెడకు గాయాలయ్యాయి. మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మార్చి 28న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మృతుడి కుమార్తె చాట్‌బాట్ సంభాషణలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ విధంగా నిజమైన వ్యక్తిగా వ్యవహరించటం దారుణమని ఆందోళన వ్యక్తం చేసింది.

Next Story