- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రివర్గంపై తీవ్ర విమర్శలు.. నెల రోజుల్లోనే ఫ్రాన్స్ ప్రధాని రాజీనామా
ఇటీవలే పట్టాలు ఎక్కిన ఫ్రాన్స్ కొత్త మంత్రివర్గంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ఆ దేశ ప్రధాని కేవలం నెల రోజుల లోపు రాజీనామా చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలే పట్టాలు ఎక్కిన ఫ్రాన్స్ కొత్త మంత్రివర్గంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ఆ దేశ ప్రధాని కేవలం నెల రోజుల లోపు రాజీనామా (resignation) చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron)కు, ప్రధాన మంత్రి సెబాస్టియన్ లెకోర్ను (Sebastian Lecornu) రాజీనామాను పత్రాన్ని అందించిగా.. అధ్యక్షుడు దాన్ని ఆమోదించారు. ప్రధాని రాజీనామాతో దేశాన్ని రాజకీయ ప్రతిష్టంభన లోకి నెట్టారని అధ్యక్ష కార్యాలయం సోమవారం ఓ ప్రకటన జారీ చేసింది. ఆలస్యంగా ప్రకటించిన పెద్దగా మార్పులేని మంత్రివర్గ శ్రేణిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. లోతుగా విభజించబడిన పార్లమెంట్ లో పార్టీల మధ్య మద్దతు పొందేందుకు ప్రయత్నించిన లెకోర్ను నియామకం జరిగిన దాదాపు ఒక నెల తర్వాత కొత్త మంత్రివర్గం ఆవిష్కరించబడింది. మాక్రాన్ ఏడవ ప్రధానమంత్రి, ప్రతిపాదిత బడ్జెట్ కోతలకు సంబంధించి అతని ముందున్న ఫ్రాంకోయిస్ బేరౌ నాటకీయంగా తొలగించబడినప్పుడు రాజకీయ సంక్షోభం మధ్య సెప్టెంబర్ 9న ఆయన నియమితులయ్యారు. కానీ తాజా పరిస్థితులతో ఆయన కేవలం నెల రోజుల వ్యవధిలోనే తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు.






