అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ కి కొలరాడో కోర్టు షాక్

by Disha Web Desk 20 |
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ కి కొలరాడో కోర్టు షాక్
X

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ట్రంప్ కి అర్హత లేదని కొలరాడో కోర్టు తీర్పునిచ్చి అనర్హత వేటు వేసింది. 2021 జ‌న‌వ‌రిలో జరిగిన క్యాపిట‌ల్ హిల్ అటాక్ కేసులో కొలరాడో కోర్టు ఇచ్చిన తీర్పుతో మైనే రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఓ సంచలన ప్రకటన చేసింది.

2024 అమెరికా ప్రెసిడెంట్ ప్రైమరీ ఎన్నికల్లో రాష్ట్ర బ్యాలెట్‌కు ట్రంప్ అనర్హుడంటూ తేల్చిచెప్పింది. కొలరాడో కోర్టు తీర్పును అమెరికాలోని మరో రాష్ట్రం కూడా పాటించింది. అమెరికాలో ఒక్క మైనే రాష్ట్ర అధికారులు మాత్రమే కాకుండా మిగతా రాష్ట్రాలు కూడా కొలరాడో తీర్పును పాటిస్తే ట్రంప్ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉండదు.



Next Story

Most Viewed