Barack Obama కు 'ఎమ్మీ' అవార్డు

by Disha Web Desk 16 |
Barack Obama కు ఎమ్మీ అవార్డు
X

వాషింగ్టన్ డీసీ: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు 'ఎమ్మీ' అవార్డు వరించింది. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ 'అవర్ గ్రేట్ నేషనల్ పార్క్స్'కు ఆయన ఉత్తమ వ్యాఖ్యాతగా ఎంపికవ్వడంతో ఈ అవార్డు దక్కింది. చాలా మంది నేరెటర్లను వెనక్కి నెట్టి ఒబామా ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. వినోద రంగంలో గ్రామీ, ఎమ్మీ, ఆస్కార్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను ఇస్తారు. ఇప్పటికే బరాక్ ఒబామా దగ్గర రెండు గ్రామీ అవార్డులు ఉన్నాయి. 'ది అడాసిటీ ఆఫ్ హోప్, ఏ ప్రామిస్డ్ ల్యాండ్' ఆడియో బుక్స్‌ కథనంపై గ్రామీ అవార్డులు వచ్చాయి. తాజాగా ఆయన ఖాతాలో ఎమ్మీ అవార్డు చేరింది. అవర్ గ్రేట్ నేషనల్ పార్క్స్ అనే డాక్యుమెంటరీని హైయర్ గ్రౌండ్స్, బరాక్ అండ్ మిచెల్ ఒబామా ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించాయి. ప్రపంచంలో ఉన్న ప్రముఖ నేషనల్ పార్కులపై ఈ డాక్యుమెంటరీని తీశారు. 1956లో అమెరికా మాజీ అధ్యక్షుడు డ్వైట్ డీ. ఈసెన్వర్‌కు మొదటిసారిగా ఎమ్మీ అవార్డు వచ్చింది. ఆయన తర్వాత బరాక్ ఒబామాకే ఈ అవార్డు దక్కింది.



Next Story

Most Viewed