శ్రీదేవిని ప్రేమించి.. తన చెల్లిని పెళ్లి చేసుకోవాలనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

by Disha Web Desk 8 |
శ్రీదేవిని ప్రేమించి.. తన చెల్లిని పెళ్లి చేసుకోవాలనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
X

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ అతిలోక సుందరి దివంగత శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె అందం గురించి వర్ణించడానికి పదాలే దొరకవు అంటారు. మత్తెక్కించే కళ్లతో, తళుక్కుమనే అందంతో ఈ ముద్దుగుమ్మ నాటి వారినే కాదు ఈ కాలం నాటి వారిని కూడా తన వైపుకు తిప్పుకుంది. అలాంటి నటి ఇప్పుడు లేదు అనేది చాలా మందిని ఇప్పటికీ బాధ పెడుతూనే ఉంటుంది. అయితే ఈ నటికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది ఏమిటంటే? ఆ రోజుల్లో శ్రీదేవి అంటే చాలా మంది హీరోలకు, కామన్ మ్యాన్స్‌కు చాలా ఇష్టం. కానీ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ అంతగా ఇంట్రెస్ట్ చూపలేదంట. అయితే ఓ స్టార్ హీరో మాత్రం శ్రీదేవిని ప్రేమించి, ఆమె చెల్లిని పెళ్లి చేసుకోవాలని చూశాడంట. ఇంతకీ అతను ఎవరు అనుకుంటున్నారా? మన సూపర్ స్టార్ రజినీకాంత్.

రజినీకాంత్‌కు శ్రీదేవికి మధ్య మంచి స్నేహం ఉండేదంట. వీరు ఉండే విధానం చూస్తే చాలా మంది వీరు ప్రేమలో ఉన్నారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటారేమో అని ముచ్చటించేవారంట. కానీ సూపర్ స్టార్ నటికి ఊహించని షాకిచ్చాడంట. ఆయన శ్రీదేవిని కాకుండా తన చెల్లిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడంటూ ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతోంది.

ప్రముఖ జర్నలిస్ట్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. అందులో శ్రీదేవి గురించి మాట్లాడుతూ.. నేను కొన్ని రోజులు శ్రీదేవి ఇంట్లో పని చేశాను. వారింటికి అప్పుడప్పుడు రజినీకాంత్ వస్తూ ఉండేవాడు. దీంతో వారందరూ సూపర్ స్టార్ శ్రీదేవిని పెళ్లి చేసుకుంటాడు అనుకున్నారు. కానీ వీరి పెళ్లి జరగలేదు. ఆయన తన చెల్లిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. ఈ విషయం తెలియడంతో శ్రీదేవి ఫ్యామిలీ రజినీకాంత్‌కు దూరంగా ఉండటం ప్రారంభించింది అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా రజినీకాంత్‌కు అప్పట్లో చాలా చెడు అలవాట్లు ఉండేవంటూ ఓపెన్ అయ్యారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed