నాది వన్ సైడ్ లవ్వే ఎప్పటికీ.. అల్లు అర్జున్ భార్య అతన్ని ప్రేమించట్లేదా? షాకింగ్ నిజాలు బయటపెట్టిన బన్ని..

by Disha Web Desk 7 |
నాది వన్ సైడ్ లవ్వే ఎప్పటికీ.. అల్లు అర్జున్ భార్య అతన్ని ప్రేమించట్లేదా? షాకింగ్ నిజాలు బయటపెట్టిన బన్ని..
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. బన్ని 2012లో స్నేహా రెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు అయాన్, అర్హ. అయితే.. ఓ ఈవెంట్‌లో ఫ్రెండ్ ద్వారా పరిచయమైన స్నేహా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అల్లు అర్జున్. కానీ, ఆ ప్రేమ ఓన్లీ వన్ సైడే అని తాజాగా చెప్పుకొచ్చాడు బన్ని.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ‘ఆర్య’ ఒకటి. 2004 వ సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అంతే కాకుండా అందులో అల్లు అర్జున్ ఓ వన్ సైడ్ లవర్‌ల చేసిన యాక్టింగ్‌కు ఎంతో మంది వన్ సైడ్ లవర్స్ ఫిదా అయ్యారు. అయితే.. తాజాగా ఈ మూవీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. స్పెషల్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే వేదికపై అల్లు అర్జున్‌ను తన లైఫ్‌లో ఉన్న వన్ సైడ్ లవ్ గురించి చెప్పమని కోరింది హోస్ట్.

దీనిపై స్పందించింన అల్లు అర్జున్.. ‘లైఫ్ టైం నా వన్ సైడ్ లవ్ స్నేహాతోనే. నేను ప్రేమించడమే తప్ప అక్కడ నుంచి పెద్దగా ఏం ఉండదు’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ కామెంట్స్ అల్లు అర్జున్ నవ్వుతూనే చెప్పినప్పటికీ.. ప్రస్తుతం ఇవి హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి. దీంతో ‘అన్నా.. ఎట్టకేలను నిజాలు బయటపెడుతున్నావా’ అని ‘వదిన నిన్ను ప్రేమించడం లేదా’ అని ‘ఈ డైలాగ్ వదిన విన్నాదంటే అంతే సంగతులు’ అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు నెటిజన్లు.

Read More...

అందంగా లేనని, ఆఫర్స్ రాలేదని సంవత్సరం పాటు రోజు ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో వాటి కోసం తిరిగాను: అల్లు అర్జున్

Next Story

Most Viewed